అగ్ర నిర్మాతలందరికీ అదే సమస్యగా మారిందా..!

  • April 20, 2024 / 11:21 PM IST

టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థలు చాలానే ఉన్నాయి. ‘గీతా ఆర్ట్స్’ ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ .. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. బడా హీరోలందరి వద్ద వీళ్ళ అడ్వాన్స్…లు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్లు, అప్ కమింగ్ డైరెక్టర్లకి కూడా అడ్వాన్స్..లు ఇచ్చి లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ నిర్మాణ సంస్థల వద్ద డబ్బుల్లేవు అనేది ఇన్సైడ్ టాక్.

అదేంటి.. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. కానీ ఇది నిజమే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వీటితో పాటు ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయట. ముఖ్యంగా ఓ సినిమా హిట్ అయ్యి, కలెక్షన్స్ వచ్చినా.. అవి నిర్మాతల వరకు రావాలంటే వచ్చిన 6 నెలల నుండి ఏడాది వరకు టైం పడుతుందట. మరోపక్క .. అగ్ర నిర్మాతలు రియల్ ఎస్టేట్ వంటి వాటిలో డబ్బులు పెట్టేస్తూ ఉంటారట. ఇంకా కొన్ని డబ్బులు హీరోలకి, హీరోయిన్లకి అడ్వాన్స్..లు ఇవ్వడానికి ఉపయోగిస్తారట.

సో సినిమా నిర్మాణానికి మళ్ళీ ఫైనాన్సియర్లని ఆశ్రయించడం, రెట్టింపు వడ్డీలకు మళ్ళీ అప్పులు చేసి తెచ్చి సినిమాల్లో పెట్టడం వంటివి చేస్తున్నారట. అంతేకాదు వరుసగా డబ్బింగ్ సినిమాలని కొందరు నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేయడం వంటివి.. కూడా ఇందులో భాగంగానే చేస్తున్నారట. పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా నిర్మాతలని బాగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus