2016 లో వచ్చిన ‘పిట్టగోడ’ అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు అనుదీప్. అంతకు ముందు రచయితగా కొన్ని సినిమాలకు పనిచేశాడు. అయితే అనుదీప్ మొదటి సినిమా ‘పిట్ట గోడ’ ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ రెండో సినిమా ‘జాతి రత్నాలు’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కథ పరంగా చెప్పుకోవడానికి పెద్ద గొప్ప సినిమాగా అనిపించదు. కామెడీ మరియు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ల కామెడీ వర్కౌట్ అవ్వడం..
వైజయంతి మూవీస్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద డిస్టింక్షన్లో పాసైపోయింది. అయితే ‘జాతి రత్నాలు’ విజయం పూర్తిగా అనుదీప్ అకౌంట్లో పడలేదు. అది కంప్లీట్ గా టీం వర్క్ లేదా నవీన్ పోలిశెట్టి క్రెడిట్ అంటుంటారు చాలామంది ప్రేక్షకులు. అంతేకాకుండా అనుదీప్ ఒక్క డైరెక్షన్ తప్ప అన్నీ తానై చేసిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా డిజాస్టర్ అయ్యింది. టైటిల్ కు తగ్గట్టుగానే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ తోనే దుకాణం సర్దేసింది ఆ మూవీ.
ఓటీటీ రిలీజ్ అయినా ఆ సినిమాని పట్టించుకున్నవారే లేరు. ‘జాతి రత్నాలు’ సక్సెస్ క్రెడితే తో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కి నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. దీంతో మేకర్స్ మంచి లాభాలు పొందారు. అయితే ఆ సినిమా రిజల్ట్ అనేది అనుదీప్ తాజా చిత్రం ‘ప్రిన్స్’ పై పడే ప్రభావం లేకపోలేదు.
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అందులోనూ ‘ఓరి దేవుడా’ ‘జిన్నా’ ‘సర్దార్’ వంటి సినిమాలు కూడా పోటీగా ఉన్నాయి. మరోపక్క ‘కాంతారా’ హవా కూడా దీపావళి ముగిసేవరకు ఉండేలా ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో ‘ప్రిన్స్’ తో అనుదీప్ గట్టెక్కడం అనేది మామూలు విషయం కాదు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!