Bigg Boss 7 Telugu: ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఏంటి ? ఓటింగ్ లో లీస్ట్ ఎవరంటే.!

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోంది. ఎందుకంటే, ఈసారి ఫిమేల్ కంటెస్టెంట్స్ కేవలం ఇద్దరు మాత్రమే నామినేషన్స్ లో ఉంటే, ఐదుగురు మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో భోలే షవాలి, టేస్టీ తేజ, గౌతమ్, పల్లవి ప్రశాంత్ ఇంకా అమర్ దీప్ , పూజమూర్తి , ఇంకా అశ్విని ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదిలకపై ఓటింగ్ అనేది దద్దరిల్లిపోతోంది. పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. సగానికి సగం ఓట్లని కైవసం చేసుకుంటున్నాడు.

45 పర్సెంట్ వరకూ కూడా పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ జరుగుతోంది. ఇలాగే బిగ్ బాస్ సీజన్ ఎండింగ్ వరకూ జరిగితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఓటింగ్ లో తోపు, దమ్ముంటే ఆఫు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైతుబిడ్డతో పాటుగా మరోవైపు పాటబిడ్డ అయిన భోళే షవాలికి కూడా మంచి ఓటింగ్ జరుగుతోంది. మొదటి రోజు భోలే షవాలి డేంజర్ జోనే లో ఉన్నా కూడా, ఆ తర్వాత తన ఓటింగ్ ని మెరుగుపర్చుకున్నాడు.

ఇక బోటమ్ లో చూస్తే గౌతమ్ కృష్ణ, అశ్విని, ఇంకా పూజమూర్తి ఉన్నారు. గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ లో వరుసగా ఫిమేల్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈసారి ఏమైనా మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే మాత్రం భోలే షవాలి- గౌతమ్ కృష్ణ – టేస్టీ తేజ ఈ ముగ్గురులో ఒకరిని చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మాత్రం బోటమ్ లో ఉన్న పూజ, అశ్విని ఇద్దరిలో ఒకరు ఇంటికి వెళ్లిపోవచ్చు.

ప్రస్తుంత డేంజర్ జోన్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. పూజ, అశ్విని, ఇంకా గౌతమ్ కృష్ణ ఉన్నారు. గౌతమ్ కృష్ణకి, భోలే షవాలికి ఓటింగ్ పర్సెంటేజ్ లో పెద్ద తేడా ఏమీ లేదు. గౌతమ్ ని ఇంట్లో ఉంచాలనుకుంటే మాత్రం భేలే షవాలిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఈవారం డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఇద్దరు హౌస్ నుంచీ మేల్ – ఫిమేల్ కంటెస్టెంట్స్ వెళ్లేపోయే చాన్స్ కూడా ఉంది. మరి ఈవారం (Bigg Boss 7 Telugu)  ఎలిమినేషన్ అనేది ఎలా జరగబోతోందో చూడాలి. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus