పోలోమని వస్తున్న పోలిటికల్ బయోపిక్స్ చూసి చూసి జనాలకు బోర్ కొట్టేసింది. మనోళ్ళకి బయోపిక్స్ తీయడానికి స్పోర్ట్స్ పర్సన్స్ లేకపోవడం, ఉన్న కొద్దిపాటిమంది బయోపిక్స్ ఆల్రెడీ బాలీవుడ్ లో వచ్చేయడంతో వేరే ఆప్షన్ లేక మనోళ్ళు ఉన్న పొలిటీషియన్స్ & సినిమా ఇండస్ట్రీ లెజండ్స్ బయోపిక్స్ తీస్తూ వస్తున్నారు. అయితే.. ఒక పొలిటీషియన్ గా కంటే వ్యక్తిగా అసంఖ్యాక అభిమానులను సంపాదించుకొన్న మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్ధుల్ కలాం జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించేందుకు తెలుగులో ఇదివరకు “గూడచారి” చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు.
దర్శకుడు మరియు నటీనటులు ఎవరు అనే విషయం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ.. ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైందని నిర్మాత అభిషేక్ చెప్పుకొచ్చారు. “గూఢచారి” లాంటి చిత్రాన్ని నిర్మించిన సంస్థ కాబట్టి “అబ్ధుల్ కలాం” బయోపిక్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారు? అబ్ధుల్ కలాంగా నటించే ఆ అదృష్టవంతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.