‘మాహిష్మతి ప్రొడక్షన్స్’ సంస్థ పై తోట రామకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా తోట రామకృష్ణనే కావడం విశేషం. సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఫేమ్ రాశి సింగ్ కథానాయికగా నటిస్తుంది. రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత వంటి పాపులర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ప్రేమకథా చిత్రాలకు ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ దేవదాసు, పార్వతి.. ప్రేమకథకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి థీమ్ ని ఇప్పటి జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.
ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యూత్ కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నట్టు నిర్మాత, దర్శకుడు రామకృష్ణ తెలిపారు. మోహిత్ రహమానియాక్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చినట్లు కూడా తెలిపారు.ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ తో కలిసి మరో స్టార్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల.. వంటి వారు అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.