మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రారంభంలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిపాసా బసు కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తుందని,ఆమెతో పోలిస్తే నేనే బెటర్ గా ఉంటాను’ అన్నట్టు కామెంట్ చేసింది. ఆ వీడియోని నార్త్ ఆడియన్స్ కొన్నాళ్ల నుండి వైరల్ చేస్తూ వస్తున్నారు. మృణాల్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ చేసిన కామెంట్స్ తప్పే.
తర్వాత బిపాసా కూడా ‘స్త్రీలు కండలు పెంచి ధైర్యంగానే కాదు దృఢంగా కూడా ఉండాలి’ అన్నట్టు మృణాల్ పై సెటైర్ వేసింది. మృణాల్ ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా తన ఇమేజ్ పెంచుకుంటుంది. ఇలాంటి టైంలో బిపాసా కామెంట్స్ తన కెరీర్ ను ఎఫెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో.. మొత్తానికి దిగొచ్చి క్షమాపణలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది.
మృణాల్ ఠాకూర్ ఈ విషయంపై స్పందిస్తూ.. “నాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సరైన అవగాహన లేక నేను కొంచెం తెలివి తక్కువగా మాట్లాడాను. ఆ టైంలో నేను పలికిన మాటలు ఇప్పుడు కొంతమంది నొప్పిస్తాయి అని నేను అనుకోలేదు. అర్థం చేసుకోకుండా అంతా ఇప్పుడు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ విషయంలో నాకూ బాధగానే ఉంది. నన్ను క్షమించండి. బాడీ షేమింగ్ చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు. ఓ ఇంటర్వ్యూలో సరదాగా పలికిన మాటలు రాంగ్ టర్న్ తీసుకున్నాయి. నేను అలా మాట్లాడి ఉండకూడదు.కాలక్రమేణా, అందం మారుతుంటుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ మార్పు కూడా విలువైనది అని నాకు అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చింది.