మిత్రా చేతికి దెబ్బ ఎందుకు తగిలింది..? అసలు కారణం ఏంటంటే..?

బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ దూసుకుని వెళ్లి టాస్క్ ఆడటం వల్లే మిత్రా చేతికి దెబ్బతగిలిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే., లాస్ట్ సీజన్ లో టాప్ – 5 కంటెస్టెంట్ లో ఒకరైన మానస్ వచ్చి తనకి ఫేవరెట్ టాస్క్ ని ఆడించాడు. గార్డెన్ ఏరియాలో సర్కిల్ లోపల ఒక కర్చీఫ్ ని ఉంచి దాన్ని విజిల్ వేసినపుడు ఎవరైతే ఒడిసి పట్టుకుంటారో వాళ్లని విజేతగా ప్రకటిస్తానని చెప్పాడు. అంతేకాదు, వాళ్లకి మిస్టరీ బాక్స్ వస్తుందని కూడా చెప్పడంతో పార్టిసిపెంట్స్ ప్రాణం పెట్టి మరీ ఆడారు. ఇక్కడే ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్లు వేరేవాళ్లని ఎలిమినేట్ చేస్తూ రావచ్చు. ఈ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ విశ్వరూపం చూపించారు. ప్రతిసారి అందరికంటే ముందు కర్చీఫ్ పైన దూసేసి మరీ ఒడిసి పట్టుకున్నారు. ఈ క్రమంలో మిత్రా చేతికి గట్టి దెబ్బ తగిలింది. రెండో రౌండ్ లో నటరాజ్ మాస్టర్ ని ఎలాగైనా డామినేట్ చేయాలని చూసిన అషూరెడ్డి తలకి గట్టి దెబ్బ తగలింది. దీంతో అషూరెడ్డి గేమ్ లో కొద్దిగా స్లో అయ్యింది. ఆ తర్వాత మిత్రా శర్మా దూకేసరికి చేతికి గాయం అయ్యింది.

ఈ టాస్క్ లో ఆడేటపుడు మిత్రాశర్మా దూసుకుంటూ వెళ్లి పడింది. నటరాజ్ మాస్టర్ ప్రతి రౌండ్ లోనూ గెలుస్తుంటే ఎలాగైనా సరే డామినేట్ చేస్తూ వెళ్లాలని ఆడింది. ఇక్కడే అషూరెడ్డి తను చాలా సెన్సిటీవ్ అని , తన బాడీ చాలా సెన్సిటీవ్ గా ఉంటుందని చెప్పింది. ఇక మెడికల్ రూమ్ లోకి వెళ్లిన మిత్రా కోసం హౌస్ మేట్స్ చాలాసేపు వెయిట్ చేశారు. చేతికి కట్టుకట్టుకుని మరీ వచ్చింది మిత్రా. ఆ తర్వాత టాస్క్ లో మిత్రాశర్మా తరపున ఆల్రెడీ ఎవిక్షన్ పాస్ టాస్క్ కి అర్హత సంపాదించిన బాబాభాస్కర్ మాస్టర్ ఆడారు.

దెబ్బలని సైతం లెక్కచేయకుండా ఈసారి హౌస్ మేట్స్ లో మిత్రా శర్మా టాస్క్ లో ఆడుతోంది. రెండోసారి తను ఫిజికల్ గా హర్ట్ అయ్యింది. ఫస్ట్ టైమ్ పంటినొప్పితో బాధపడింది. ఈసారి చేతికి గట్టి దెబ్బ తగిలింది. అయితే, ఇక్కడ హౌస్ మేట్స్ మిత్రాశర్మాని లైట్ తీస్కున్నారని అనిపించింది. ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. టాస్క్ లో అలా జరుగుతూనే ఉంటాయని చాలా లైటర్ వే లో తీసుకున్నారు. ఇక మిత్రా బదులుగా ఆడిన మాస్టర్ చాలాసేపు పోరాడారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus