టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు దగ్గర దొడ్డిపట్ల గ్రామానికి చెందిన ఇతను దాదాపు 18 ఏళ్లుగా సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. చూడటానికి చాలా పద్దతిగా, ఇన్నోసెంట్ గా కళ్ళజోడు పెట్టుకుని కనిపిస్తాడు. మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. ఇతనికి 38 ఏళ్ల వయసు అంటే నమ్మడం కొంచెం కష్టమే. అతని కటౌట్ అలా ఉంటుంది మరి.
కానీ ఇప్పటివరకు 580 పాటలు రాశాడు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇతను రాసిన చాలా పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. అనంత శ్రీరామ్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు.అందువల్ల అతని పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయ్యింది. విషయం ఏంటి అంటే.. ఇటీవల అనంత శ్రీరామ్ పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాడు. అక్కడ అతను స్పీచ్ ఇస్తూ.. భట్రాజు పొగడ్తలు అన్నాడట. అది భట్రాజు కులస్తుల మనోభావాలను దెబ్బతీసింది.
అందుకు ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్టేజీపై అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆ కంప్లైంట్ తో పాటు జతచేసి అందజేశారట. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. అయినా తమ కులంపై ఈ తరహా కామెంట్స్ చేయడం ఏంటి అంటూ వాళ్ళు అనంత శ్రీరామ్ పై మండిపడుతున్నారు. గతంలో కూడా దేవతలను విమర్శించేలా పాట రాశారని అనంత శ్రీరామ్ పై కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇప్పుడిది రెండోసారి…!