క్యూట్ బ్యూటీ సమంత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏడేళ్లు గడిచి పోతున్నాయి. త్వరలో అక్కినేని నాగచైతన్యతో ఏడు అడుగులు వేయబోతోంది. ఓ వైపు ప్రొఫిషనల్ లైఫ్ ని డీల్ చేస్తూనే, మరో వైపు పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇంత ఒత్తిడిలోనూ ఆమె అందంపై పెట్టిన శ్రద్ధ అభినందనలు కురిపిస్తోంది. రెండు రోజుల క్రితం బంగారు రంగులో ఉన్న లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలో సమంత దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. అభిమానులు ఈ డ్రస్సులో చూసి.. అందంతో చంపేస్తున్నావు.. సౌత్ ఇండియా కరీనా కపూర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
మరికొంతమంది మాత్రం ఆమెను నటన నుంచి ఏవీ దూరం చేయలేవంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ కేశ్రా బజాజ్ డిజైన్ చేశారని, దీనిని 7వ తేదీన క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరగనున్న రోజు ధరిస్తుందని సమాచారం. 6వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం జరగబోయే పెళ్లిలో చైతు అమ్మమ్మ రాజేశ్వరి చీరను సమంత కట్టుకోనుంది.