Nagarjuna: ఫ్లాప్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచిన నాగ్ సినిమా..!

ఒకానొక టైంలో నాగార్జున (Nagarjuna) మాస్ లో చాలా వెనకబడి ఉండేవారు. అంతకు ముందు నాగార్జున మాస్ సినిమాలు చేసినా పూర్తి క్రెడిట్ ఆయనకు దక్కలేదు. అలాంటి టైంలో ‘ప్రెసిడెంటుగారి పెళ్ళాం’ ‘అల్లరి అల్లుడు’ ‘హలో బ్రదర్’ (Hello Brother) వంటి సినిమాలు వచ్చాయి. ఇవన్నీ సూపర్ హిట్లు అయ్యి నాగార్జునని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. ముఖ్యంగా ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున దేవా అనే మాస్ రోల్ చేస్తూనే.. దాంతో కామెడీ కూడా పండించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Nagarjuna

ఈ సినిమా తర్వాత నాగార్జున సినిమాకి మార్నింగ్ షోలు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడటం స్టార్ట్ అయ్యాయి. అయితే వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న టైంలో ‘క్రిమినల్’ అనే థ్రిల్లర్ సినిమా చేశారు నాగార్జున. దీని కథ, కథనాలు కొత్తగా ఉన్నప్పటికీ… ఆడియన్స్ పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. దీంతో మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని నాగార్జున ‘ఘరానా బుల్లోడు’ అనే సినిమా చేశారు.

రాజమౌళి (S. S. Rajamouli) తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కథ అందించిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు (M. M. Keeravani) దర్శకుడు. 1994 ఏప్రిల్ 27న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే మొదటి ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. ‘గ్లామర్ శృతి మించిందని, హీరో రేప్ సీన్ చేయడం ఏంటి?’ అంటూ చాలా మంది విమర్శించారు.ముఖ్యంగా కీరవాణి (M. M. Keeravani) సంగీతంలో రూపొందిన ‘ ‘భీమవరం బుల్లోడా’ అనే పాటలో చాలా డబుల్ మీనింగులు ఉన్నాయి..’ అని ఎద్దేవా చేశారు.

మొదటి రోజు ఈవెనింగ్ షోల వరకు ఇదే టాక్ ఉంది. కానీ ఫస్ట్ షోలు, సెకండ్ షోలు చూసిన వాళ్ళు బాగానే ఉంది అన్నారు. రెండో రోజు కూడా ఇంతే. అయితే 3వ రోజు నుండి టాక్ మారిపోయింది. కలెక్షన్స్ పెరిగాయి. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. నేటితో ‘ఘరానా బుల్లోడు’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 30 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం హిట్ ‘ఖుషి’ కి 24 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus