నటికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్!

ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని అతడిపై ఫిర్యాదు చేసింది పార్వతి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసెంబర్ 20న నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి దాదాపు రెండేళ్లుగా పార్వతి వెంటపడి ఆమెని వేధిస్తున్నాడు. ఆమెకి అసభ్యకర మెసేజ్ లు పంపించడంతో పాటు.. డెలివెరీ బాయ్ గెట లో తరచూ ఫుడ్ పార్శిల్ తీసుకొని

ఏకంగా పార్వతి ఇంటికి వచ్చి రచ్చ చేసేవాడు. దీంతో పార్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వద్దని అతడిని హెచ్చరించినా.. అతడు వినలేదని పార్వతి పోలీసులకు వెల్లడించింది. వార్నింగ్ ఇచ్చినా.. ఆమెకి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాడని.. సెక్యూరిటీతో కూడా గొడవలు పెట్టుకున్నాడని చెప్పుకొచ్చింది. పార్వతి ఇచ్చిన ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు.. నిందితుడు హర్షని అరెస్ట్ చేస్తూ.. ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

గతంలో కూడా పార్వతి ఇలానే ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. 2019లో కిషోర్ అనే వ్యక్తి లాయర్, ఫిలిం మేకర్ అని పార్వతి కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ తరువాత పార్వతిని వేధించాడు. దీంతో ఆమె ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఇక పార్వతి కెరీర్ విషయానికొస్తే.. తమిళ, మలయాళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘బెంగుళూరు డేస్’, ‘టేకాఫ్’ వంటి సినిమాలతో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus