ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి ఆసక్తికర టైటిల్

కథల ఎంపికలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్క కథ ఏమిటి.. టైటిల్ నుంచి శుభం కార్డు వరకు పక్క సెట్ అయితేనే.. సెట్స్ మీదకు వెళుతున్నారు. అలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి వరుసగా నాలుగు విజయాలను అందుకున్నారు. ఆ విజయ పరంపరను కొనసాగించడానికి శ్రమిస్తున్నారు. కొత్త లుక్ తో ఆకర్షించడానికి కసరత్తులు చేస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ చర్చల్లోను పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ టైటిల్ ని సూచించారంట. అది చాలా నచ్చడంతో దానినే ఫైనల్ చేయమని చెప్పినట్లు తెలిసింది.

ఆ పేరు మాత్రం ప్రకటించేవరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ట్యాగ్ లైన్ మాత్రం బయటికి వచ్చింది. “ఆన్ సైలెంట్ మోడ్” అనే ఉపశీర్షిక ఖరారు చేసినట్లు సమాచారం. దీని సహాయంతో టైటిల్ ని గెస్ చేయడానికి సినీ విశ్లేషకులు రంగంలోకి దిగారు. ఇక త్రివిక్రమ్ మాత్రం ఇందులో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్స్ ని సెలక్ట్ చేశారు. శ్రద్ధ కపూర్, పూజ హెగ్డే లు తారక్ తో రొమాన్స్ చేయనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus