Akhanda: ‘అఖండ’కి ఈ రేర్‌ ఫీట్‌ ఎలా సాధ్యమైందబ్బా!

  • March 13, 2022 / 07:05 PM IST

‘మా సినిమా ఇన్ని సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది’ ఇలాంటి బ్యానర్లు, యాడ్‌లు, ప్రెస్‌ మీట్లు చూసి ఎన్ని రోజులైంది. వంద రోజుల ఉత్సవం ఓ సినిమాకు జరిగి ఎన్ని రోజులైంది. అబ్బో ఆ లెక్క చెప్పాలంటే చాలా ఏళ్లు వెనక్కి వెళ్లాల్సింది. సినిమాలకు లాంగ్‌ రన్‌ అంటే రెండు వారాలు దాటి, మూడో వారం అనే పరిస్థితి ఇప్పుడుంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా నాలుగో వారం రన్‌ కోసం ఆలోచిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఓ సినిమా నాలుగు, ఐదు వారాలు కాదు ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే ‘అఖండ’. అయితే ఇక్కడి ప్రశ్న ఎలా?

Click Here To Watch Now

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’. గతేడాది డిసెంబరు 2న విడుదలైన ఈ సినిమా మొన్న మార్చి 11కి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కర్నూలులో కృతజ్ఞత సభ పేరుతో వంద రోజుల వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందమంతా వచ్చి… తమ ఆనందాన్ని మరోసారి పంచుకున్నారు. తమ సినిమా భారతీయ చిత్రపరిశ్రమకు దిక్సూచీగా నిలిచింది అంటూ సంబరపడిపోయారు కూడా.

అయితే, ముందు చెప్పుకున్నట్లుగా రెండు, మూడు వారాల రన్స్‌ సాధ్యం కాని నేటి రోజుల్లో ఓ సినిమా వంద రోజులు ఎలా పూర్తి చేసుకుంది అనేదే ఇక్కడ ప్రశ్న. అసలు ఈ సినిమాకు ఆ ఫీట్‌ ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. బాలయ్య స్టామినా, బోయపాటి డైరక్షన్‌, కథ– కథనం, తమన్‌ సంగీతం, పోరాట సన్నివేశాలు అన్నీ కలిపి సినిమాను మాస్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఇప్పుడు వంద రోజులు ఆడటానికి కూడా అవే కారణం అని అంటున్నారు.

సినిమాకు థియేటర్లలో ఎంత స్పందన వచ్చిందో, ఓటీటీలో అంతే స్పందన వచ్చింది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ కూడా సినిమాకు భారీగా వీక్షిస్తున్నారట. అంటే, ఓటీటీలో సినిమా వచ్చినా.. ఇప్పటికీ థియేటర్లకు వెళ్లి సినిమా చూడటానికి జనాలు ఇష్టపడ్డారు అని చెప్పొచ్చు. లేకపోతే అన్నేసి రోజులు సినిమా ఆడటం, అందులోనూ ఈ రోజుల్లో అంటే కష్టమే కదా. అయితే ఏపీలో టికెట్‌ ధరల బాగా తక్కువగా ఉన్న రోజుల్లో వచ్చి… నాలుగు థియేటర్లలో వంద రోజులు ఆడటం అంటే ఇంకా విచిత్రమే.

ఈ టికెట్‌ ధరలతో ఒక్క షో కూడా సినిమా వేయడం సాధ్యం కాదని, థియేటర్ల యాజమాన్యాలు థియేటర్లను మూసివేసిన ఏపీలో ‘అఖండ’ను ఆ తక్కువ ధరలకు వంద రోజులు వేయడం ఎంతైనా సాహసమే. కానీ బాలయ్య సినిమాకు ఆ గౌరవం దక్కింది. అన్నట్లు వంద రోజులు ఆడిన థియేటర్లు చెప్పలేదు కదా. ఆదోనీ, ఎమ్మిగనూరు, కోయిలకుంట్ల, చిలకలూరిపేట. అవును ఈ థియేటర్లలో సినిమా వంద రోజులు ఆడింది. డెఫిసిట్‌ కూడా లేకుండా సినిమా వంద రోజులు ఆడిందని సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus