Ram Charan, Shankar: ‘RC15’ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

  • October 26, 2021 / 08:54 AM IST

రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సంగతి అటుంచితే.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ వరుసప్రాజెక్టులని సెట్ చేసుకుంటున్నాడు. ‘ఆచార్య’ షూటింగ్ ను కూడా చాలా వరకు కంప్లీట్ చేసాడు.శంకర్ సినిమాతో పాటు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా శంకర్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది.

చరణ్ తో పాటు మరికొంతమంది నటీనటులు మొదటి షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.ఇక ఈ చిత్రంలో విలన్ గా ఓ సీనియర్ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం. మలయాళ హీరో సురేష్ గోపి ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడట.అతనిది ఈ చిత్రంలో ఓ పొలిటీషియన్ పాత్ర అని, అవినీతికి ప్రతిరూపం లాంటి పాత్ర అని తెలుస్తుంది. చరణ్ కు సురేష్ గోపికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమాలో కూడా సురేష్ గోపి విలన్ గా నటించాడు.

ఆ సినిమాకి మించి ఇందులో సురేష్ గోపి విలన్ పాత్ర ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి రైటర్ గా పనిచేస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus