సీరియల్ నటి గౌరీ రాజ్ అందరికీ సుపరిచితమే. ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌తో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ‘మల్లి’ సీరియల్‌లో కూడా నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఈమె నటనకు దూరంగా ఉంటుంది. దీని వెనుక చాలా విషాదం దాగి ఉంది అని గౌరీ చెప్పడం జరిగింది. గౌరీ రాజ్ మాట్లాడుతూ.. “సీరియల్స్‌లో నటిస్తున్న టైంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను.అయితే ఆ విషయం నాకు తెలీలేదు. కాబట్టి నేను చాలా ఫైట్ సీన్లలో నటించాను. దీంతో 20-25 రోజులు రక్తస్రావం జరిగింది.
అప్పటికీ నేను పట్టించుకోలేదు. కడుపునొప్పి ఉన్నప్పటికీ షూటింగ్‌లలో పాల్గొంటూనే ఉండేదాన్ని.ఒకరోజు భరించలేనంత నొప్పి రావడంతో హాస్పిటల్ కి వెళ్లాను. అప్పుడు డాక్టర్లు స్కానింగ్ చేయించుకోమని చెప్పగా అందులో నేను గర్భం ధరించినట్టు తేలింది. నేను సంతోషంతో ఉండగా.. తర్వాతి రోజు మాత్రం డాక్టర్లు నా కడుపులో బిడ్డ బ్లాస్ట్ అయి.. శరీరమంతా పడింది అంటూ చెప్పి షాకిచ్చారు. అది క్లీన్ చేయకపోతే నా ప్రాణానికే ప్రమాదం అని తేల్చిచెప్పేసారు.
ఈ క్రమంలో నాకు (Gowri Raj) సర్జరీతో పాటు లాపరోస్కోపీ కూడా చేయడం జరిగింది. అప్పటికే ప్రెగ్నెన్సీ పోవడం అనేది నాకు రెండు సార్లు జరిగింది. ఆ టైంలో చాలా నరకం అనువించాను. మూడో సారి కూడా ప్రెగ్నెన్సీ పోవడంతో డాక్టర్లు కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకే సీరియల్స్ కి దూరంగా ఉండటం జరిగింది. ప్రెగ్నెన్సీలు పోవడం.. ఇంజక్షన్లు, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల లావైపోయాను.నా ముగ్గురు పిల్లలు దేవుని దగ్గర ఉన్నారంటూ కంట తడి పెట్టుకున్నారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!