Akhanda2: అఖండ2 విషయంలో బోయపాటి నిర్ణయమిదేనా.. అలా చూపించబోతున్నారా?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ టికెట్ రేట్లతో విడుదలై విడుదలై ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. అయితే అఖండ2 సినిమా సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఉండనుందని భోగట్టా. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని ప్రచారం జరుగుతున్నా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అఖండ2 సినిమాలో బోయపాటి శ్రీను బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బోయపాటి శ్రీను స్కంద సినిమాతో నిరాశ పరిచిన నేపథ్యంలో అఖండ2 సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. అఖండ2 సినిమాను నిర్మించడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను నిర్మించే లక్కీ ఛాన్స్ ఎవరి సొంతమవుతుందో చూడాల్సి ఉంది.

అటు బాలయ్య ఇటు బోయపాటి శ్రీను పారితోషికం భారీ రేంజ్ లో ఉంది. బోయపాటి శ్రీను తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాను 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బన్నీ బోయపాటి శ్రీను కాంబోలో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది. (Akhanda2) అఖండ2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అఖండ2 సినిమాకు టాప్ టెక్నీషియన్లు పని చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus