ఎవర్‌గ్రీన్ నటి శ్రీదేవి మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొద్ది గంటల క్రితం ఓ పెళ్లి వేడుకలో నవ్వుతూ డ్యాన్స్ చేసిన శ్రీదేవి హఠాత్తుగా చనిపోయిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. దుబాయ్‌లో తన భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలిసి మోహిత్ మార్వా వివాహ వేడుకను జరుపుకుంటున్న శ్రీదేవి గుండెపోటుతో మరణించడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. పెళ్లి వేడుకలు పూర్తయ్యాక, కుటుంబం మొత్తం ఇండియాకి తిరిగి వచ్చింది. కానీ శ్రీదేవి ఒంటరిగా దుబాయ్‌లో ఎందుకు ఉండిపోయిందనే ప్రశ్న కూడా ఉంది.
భర్త బోనీ కపూర్, చిన్న కుమార్తె ఖుషి కూడా ముంబైకి తిరిగి వచ్చారు. అలాంటప్పుడు శ్రీదేవి అసలు అక్కడ ఎందుకు ఒంటరిగా ఉంది. బోనీకపూర్‌తో ఆమెకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఏదో విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అందుకే తాను ఒంటరిగా అక్కడే ఉండిపోయిందా అన్న సందేహాలు తలెత్తాయి. ఏది ఏమైనా శ్రీదేవి మనకు దూరమైనప్పటికీ ఆమె నటించిన చిత్రాలో తాను ఇప్పటికీ బతికే ఉందిఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా అతిలోక సుందరి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీదేవి.
సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఓ వెలుగు వెలిగింది. ఎన్ని అవార్డులు అందుకుందో లెక్కేలేదు. శ్రీదేవి దుబాయిలో ఓ హోటల్లో కాలుజారి బాత్ టబ్ లో పడి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కాదు ఎవరో ఆమెను కావాలనే ఆమెను హత్య చేశారని జనాలు ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే సరిగ్గా శ్రీదేవి మరణించేందుకు నెల రోజుల ముందే శ్రీదేవికి (Sridevi) తను చనిపోతానన్న విషయం తెలుసట.
ఆమె ఓ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పండితుడు.. మీకు త్వరలోనే ప్రమాదం ముంచుకు రాబోతుందంటూ హెచ్చరించాడట. ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు సమయం దగ్గర పడిందని చెప్పుకొచ్చాడట. టైం బ్యాడో ఏమో తెలియదు కానీ.. మొదటి నుంచి శ్రీదేవి ఇలాంటివి పెద్దగా నమ్మదు. పండితుడు చెప్పిన విషయాన్ని కూడా లైట్ తీసుకుంది.
కానీ ఏదైతే అది అయిందని డౌట్ మనసులోనే దాచుకుని తన ఆస్తుల వివరాలను తన పిల్లలకు వివరించిందట. తాను మరణిస్తే పిల్లలకు దక్కే హక్కుల గురించి కూడా చెప్పిందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన శ్రీదేవి అభిమానులు మరణ వార్త తెలిసి నెల రోజులు ఎంత నరకం అనుభవించిందో అంటూ కామెంట్ చేస్తున్నారు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !