Jr NTR: యంగ్ టైగర్ గురించి ఆ వార్తలు నిజమేనా..?

సినిమా హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు సైతం అవకాశాలను ఇచ్చి ఆయా దర్శకులకు విజయాలను అందించిన ఘనత యంగ్ టైగర్ సొంతమని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా అపజయమెరుగని జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా క్రేజ్ ఎంత పెరుగుతున్నా బుల్లితెరపై రియాలిటీ షోలను హోస్ట్ చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోవడం లేదు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తెలుగులో విజయవంతంగా హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో మే నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా

కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. అయితే గత రెండు రోజులుగా ఈ షో ఆగిపోయిందని ఎన్టీఆర్ మరో హీరోతో ఈ షోను నిర్వహించుకోవాలని జెమినీ ఛానల్ నిర్వాహకులకు చెప్పారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎవరు మీలో కోటీశ్వరులు షో అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో ఈ షో ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది.

అయితే సినీ విశ్లేషకులు మాత్రం తారక్ హోస్ట్ గా ప్రోమోలు విడుదలైన తరువాత షో హోస్ట్ చేయకపోతే తనపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ హోస్ట్ చేసే షో ఆగిపోయినా, ఆ షోను తారక్ కు బదులుగా మరొకరు హోస్ట్ చేసినా తారక్ కెరీర్ పై ఆ ప్రభావం పడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి తారక్ రియాలిటీ షో నిజంగానే ఆగిపోయిందా..? లేదా..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మాత్రం మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus