పాపం ఆ హీరోయిన్ కి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదంట..!

టాలీవుడ్ సినిమాల ద్వారా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వరుసగా సూపర్ హిట్స్ని అందుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె తెలుగు లో మల్లీశ్వరి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఈమెకి టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

తర్వాత ఈమె తెలుగు లో బాలయ్య బాబు తో ‘అల్లరి పిడుగు’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె సౌత్ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని ఎంజాయ్ చేస్తూ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా క్రేజీ హీరోయిన్ గురించి సోషల్ మీడియా లో బయటపడిన ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.

అదేమిటంటే ఈమె సౌత్ లో సినిమాలు తక్కువే చేసినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలతో మాత్రం బాగానే క్లోజ్ గా ఉండేదట. ప్రైవేట్ పార్టీలలో కలుస్తూ అలా పరిచయాలు ఏర్పడ్డాయాట. అలా 7 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో ఈమెకి పరిచయమయ్యాడట. ఆ పరిచయం కాస్త స్నేహం గా కూడా మారింది. అయితే అప్పట్లో ఈ కుర్ర హీరో ఒక సినిమాని నిర్మించాడు. ఈ చిత్రం లో ఆయనే హీరో గా నటించాడు కూడా.

రివ్యూస్ బాగానే వచ్చినప్పటికీ కూడా ఎందుకో కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఫైనాన్సర్స్ కి తిరిగి డబ్బులు ఇచ్చేందుకు ఆ సమయం లో ఈయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదట. అప్పుడు ఎవరిని అడగాలో తెలియక కత్రినా కైఫ్ ని 5 కోట్ల రూపాయిలు డబ్బులు అడిగితే ఆమె వెంటనే ఇతనికి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ హీరో (Katrina Kaif) కత్రినా కి తిరిగి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus