Indra Movie: ‘ఇంద్ర’ సినిమా బన్నీకి అలా గుర్తుండిపోతుందట!

చిరంజీవి డ్యాన్స్‌ వేస్తుంటే.. అలా కన్నార్పకుండా చూడాలి అనిపిస్తుంటుంది. ఈ మాట మేము అనడం కాదు, ఎంతో మంది సెలబ్రిటీలే అన్నారు. ఆయన డ్యాన్స్‌ చేస్తుంటే పక్కన ఉన్నవాళ్లు కూడా కనిపించరు, అంతగా ఆయన మీదకు ఫోకస్‌ వెళ్లిపోతుంది అని చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి కారణం వల్లే అల్లు అర్జున్‌ రూ. 25 వేలు నష్టపోయాడట. అదేంటి డ్యాన్స్‌ చూస్తే డబ్బులు లాస్‌ అవ్వడమేంటి అనుకుంటున్నారా? అయితే బన్నీ చెప్పిన ఈ విషయాలు చదవాల్సిందే.

చిరంజీవి వల్ల జీవితంలో ఒకే ఒకసారి నష్టపోయా. పాతికవేల రూపాయలు పోగొట్టుకున్నా అంటూ ఆసక్తికర విషయం వెల్లడించాడు బన్నీ. ‘ఇంద్ర’ సినిమా విడుదలైన సమయంలో బన్నీకి, అతని స్నేహితుడికి మధ్య ఓ చర్చ జరిగిందట. ఆ సినిమాలో ‘దాయి దాయి దామ్మా..’ పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్‌ గురించి ఇద్దరం మాట్లాడుకున్నారట. ఆ పాటలో చిరు వీణ స్టెప్‌ వేసేటప్పుడు పక్కన సోనాలిబింద్రే ఉందని అతని స్నేహితుడు వాదించాడట. లేదు అని బన్నీ వాదించాడట

నేను ఆ సినిమా 17 సార్లు చూశా. చిరు సోలోగానే ఆ స్టెప్‌ వేశారు అని గట్టిగా వాదించాడట బన్నీ. ఈ చర్చ ఎంతకీ తేలకపోయే సరికి దీంతో రూ.25వేలు పందెం కట్టారట. వెంటనే ఆ పాట వీడియో ప్లే చేసి చూస్తే, సోనాలి బింద్రే చిరంజీవి పక్కన ఉంది. దీంతో బన్నీకి అసలు విషయం అర్థమయ్యిందట. అప్పటివరకూ బ్లాక్‌ ప్యాంట్‌, రెడ్‌ షర్ట్‌ వేసుకుని వీణ స్టెప్‌ వేస్తున్న చిరంజీవిని మాత్రమే చూశాను తప్ప, పక్కన ఉన్న సోనాలి బింద్రేను గుర్తించలేకపోయాను అని బన్నీకి అర్థమయ్యిందట.

అలా వీణ స్టెప్‌ తన రూ. 25 వేలు పోగొట్టింది అని చెప్పారు బన్నీ. అయితే ఆ స్నేహితుడు ఎవరు, ఎవరితో ఈ బెట్‌ కట్టారు అనే విషయాల్ని చిరంజీవి చెప్పలేదు. రూ. 25 వేలు పోతే పోయాయి కానీ, చిరు ఫ్యాన్స్‌కి, బన్నీ ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చే న్యూస్‌ చెప్పాడు బన్నీ. అట్లుంటది చిరంజీవి డ్యాన్స్‌తోని అని అనాలనిపిస్తోందా. అయితే అనేయండి మరి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus