చిరంజీవి వల్ల కథనే మార్చేసారట… అసలు కథ ఏంటంటే…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అతిలోక సుందరి.. దివంగత అందాల నటి శ్రీదేవి హీరోయిన్ గా .. కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం విడుదలయ్యి ఈరోజుతో 30 ఏళ్ళు పూర్తయ్యింది. 1990 మే 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎన్ని జనరేషన్స్ వారికైనా హాట్ ఫేవరెట్ గానే ఉంటుంది. ఏమాత్రం టెక్నాలజీ అభివృద్ధి చెందని రోజుల్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూస్తే ఫ్రెష్ ఫీల్ కలిగేలా ఉంటుంది. పైగా ఈ చిత్రం విడుదలైనప్పుడు భయంకరమైన వర్షాలు.

దాంతో డిస్ట్రిబ్యూటర్ లు గోల పెట్టేశారట. అయితే సినిమా సూపర్ హిట్ అయ్యింది అని తెలీగానే వర్షాలను కూడా లెక్క చెయ్యకుండా ప్రేక్షకులు థియేటర్లకు కదిలి వచ్చారట. ఇదిలా ఉండగా ముందుగా … ఈ చిత్రం కథ ఇది కాదట. చిరు వల్ల మారిందట.దేవలోకం నుండీ వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగుట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూలోకానికి వచ్చి ఇక్కడ స్థిరపడుతుంది.అయితే ముందుగా హీరో హీరోయిన్ ల కలుసుకునే సీన్ ను మాత్రం మార్చారట.‘గాయపడిన పాప… చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయని తెలుసుకున్న హీరో…. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు… చంద్రుడి పైకి ఒక మిషన్ ను పంపాలని అనుకుంటారు.

అందుకోసం స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళ్ళి వచ్చిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన చిరు స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడికి విహరించేందుకు వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగోట్టుకుంటుంది. అది కాస్త చిరుకు దొరకడం… ఇది తెలుసుకున్న శ్రీదేవి… చిరుని వెతుక్కుంటూ భూమి మీదకు వస్తుంది. ఇది ముందు అనుకున్న కథ. అయితే… చంద్రుడు, స్పేస్ షిప్ వంటివి సహజంగా ఉండవు అని రాఘవేంద్ర రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారట. దీంతో చిరు… మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లొచ్చినట్టు పెడదాం అని చెప్పగా… దానినే ఖాయం చేసారట. అలా చిరు వల్ల కథ మార్చారట.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus