హిట్ కాంబో..బ్లాక్ బస్టర్ నిర్మాత.. అయినా వెనకడుగు..!

ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే.. ఏదైనా అసాధ్యమే..! ‘ఇది కచ్చితంగా జరుగుద్ది’ అనుకున్నది ఒక్కోసారి జరగదు. ఇది ‘జరిగే సమస్యే లేదు’ అనుకున్నది జరగొచ్చు. ఏదీ ఊహించలేం… తొందరగా అంచనా వేయలేం..! సరే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.. నితిన్ (Nithiin)  హీరోగా విక్రమ్ కే కుమార్  (Vikram kumar) దర్శకత్వంలో 12 ఏళ్ళ క్రితం ‘ఇష్క్’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. అది ప్లాపుల్లో ఉన్న నితిన్ ను.. తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.

Vikram K Kumar, Nithiin

ఎందుకో ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ‘మనం’ (Manam) ’24’ (24) వంటి సినిమాలతో విక్రమ్ కుమార్ రేంజ్ పెరిగినా.. నితిన్- విక్రమ్ కుమార్ కాంబో సెట్ అవ్వలేదు. ఎందుకంటే అదే టైంలో విక్రమ్ కుమార్.. రాంచరణ్  (Ram Charan) వంటి బడా హీరోల కోసం ఎదురు చూశాడు. ‘థాంక్యూ’ (Thank You) ప్లాప్ వల్ల అతని అంచనాలు తారుమారు అయ్యాయి. అయినప్పటికీ ‘దూత’ (Dootha) తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు విక్రమ్ కుమార్.

కాబట్టి.. ఇప్పుడు ఇతనితో సినిమా చేయడానికి నితిన్ ఓకే చెప్పాడు. విక్రమ్ చెప్పిన లైన్ కూడా నితిన్ కి నచ్చింది. ఈ కాంబోలో సినిమా నిర్మించడానికి ‘హనుమాన్’ (Hanuman) నిర్మాత నిరంజన్ రెడ్డి ముందుకు వచ్చాడు. కథ ప్రకారం.. ఈ సినిమాకు రూ.80 కోట్లు బడ్జెట్ పెట్టాల్సి ఉంటుందట. కానీ నిరంజన్ రెడ్డి ఇప్పుడు అంత పెట్టేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమా వల్ల అతను రూ.40 కోట్ల వరకు నష్టపోయాడు.

మరోపక్క సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా కోసం రూ.120 కోట్లు బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యాడు. కాబట్టి.. ఇప్పట్లో అతను ఇంకో పెద్ద సినిమా నిర్మించడం కష్టం. అందుకే నితిన్ -విక్రమ్ కుమార్..ల ప్రాజెక్టుని శ్రీనివాసా చిట్టూరి నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. దసరా టైంకి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

మొదటిది ప్లాప్ అయినా.. ఇది మంచి ఛాన్సే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus