ANR, Chiranjeevi: 30 ఏళ్ళ క్రితం చిరు సినిమా వల్ల ఏఎన్నార్ విమర్శలు పాలైన వేళ!

ఏడు పదుల వయసులో కూడా స్టార్ హీరోలు.. ఏదో ఒక పాత్రలో నటించి మెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగిన ఏఎన్నార్ ను ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా చేశారు. కానీ ఏఎన్నార్ అలా కాదు. ఎప్పుడు ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి అనే ఉద్దేశంతో ముందుగానే ఓల్డ్ గెటప్ లో ఉండే పాత్రలు కూడా చేసేవారు.

(Chiranjeevi) చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారి టైం స్టార్ట్ అయ్యాక.. అప్పటికి సీనియర్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి వారు వాళ్ళ సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 1993 కి వెళ్దాము. ఆ ఏడాది మోహన్ బాబు నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్‌’లో ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

మరోపక్క తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, ఆమని జంటగా నటించిన ‘పచ్చని సంసారం’ కూడా హిట్ అయ్యింది. ఇక సోగ్గాడు శోభన్ బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమా కూడా అదే ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు , సుమన్ తో కలిసి శరత్ దర్శకత్వంలో వచ్చిన ‘బావా బావమరిది’ సైతం బ్లాక్ బస్టర్ అయ్యింది.నిజానికి ఈ సినిమాల పై అంచనాలు అంతంత మాత్రమే.

కానీ అదే ఏడాది వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ పై రిలీజ్ కు ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు.. చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. ‘గురువా గురువా’ అనే పాటలో చిరుతో కలిసి ఉత్సాహంగా చిందులు వేశారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్. కానీ ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1993 మే 27న రిలీజ్ అయ్యింది. నేటితో 30 ఏళ్ళు. ‘మెకానిక్ అల్లుడు’ వల్ల ఏఎన్నార్ విమర్శల పాలయ్యారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus