Bigg Boss 7 Telugu: 7వ వారం కొత్త కెప్టెన్ ఎవరు ? బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి ?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా గెలిచిన జిలేబీ పురం మెంబర్స్ అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్లలో నుంచీ కెప్టెన్ కి ఎవరు అనర్హులో ప్రకటించి తగిన కారణాలు చెప్పమని గులాబీ పురం మెంబర్స్ కి ఆర్డర్ వేశాడు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని తప్పించారు. స్మిమ్మింగ్ పూల్ లో ఫ్లోట్ ఆర్ సింక్ టాస్క్ లో భాగంగా వారి ఫోటోని పూల్ లో ముంచి మరీ వారిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఒక్కొక్కరూ వచ్చి ఒక్కొక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించారు.

ముందు అమర్ శివాజీని రేస్ నుంచీ తప్పించాడు. ఇద్దరి మద్యలో గట్టి మాటల యుద్ధం అయ్యింది. దీంతో హర్ట్ అయిన శివాజీ నన్ను పంపించేయండి బిగ్ బాస్. వెంటనే డోర్స్ తీసేయండి అంటూ రెచ్చిపోయాడు. ఆటలో సరైన కారణం చెప్పడం లేదని శివాజీ అమర్ ని నిలదీశాడు. ఆ తర్వాత పూజ వచ్చి ప్రశాంత్ ని రేస్ నుంచీ తప్పించింది. ఇక్కడ ప్రశాంత్ కి ఇంకా పూజకి పెద్ద ఆర్గ్యూమెంట్ జరిగింది. ఆ తర్వాత యావర్ వచ్చి ప్రియాంకని తప్పించాడు. దీంతో ప్రియాంక ఫీల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది.

ఆటకుండా చేస్తున్నారు. గ్రూప్ గా ఆడుతున్నావ్ అని చెప్తున్నారు. నేను హౌస్ లోకి సోలోగా వచ్చాను, సోలోగానే పోతాను అంటూ గట్టిగా చెప్పింది. ఇక శోభాశెట్టి అశ్విని ఫోటోని పూల్ లో పారేసి అశ్వినిని రేస్ నుంచీ తప్పించింది. దీంతో సందీప్ మాస్టర్ ఇంకా అర్జున్ మాత్రమే కెప్టెన్సీ రేస్ లో మిగిలారు. వీరిద్దరికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అర్జున్ ఇంకా సందీప్ ఇద్దరూ కూడా కళ్లకి గంతలు కట్టుకుని కెప్టెన్ అనే లెటర్స్ ని ముందుగా బోర్డ్ పై ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.

ఈ టాస్క్ లో సందీప్ మాస్టర్ కంటే ముందు అర్జున్ ఫినిష్ చేసి టాస్క్ విన్నర్ గా నిలిచినట్లుగా సమాాచారం. నిజానికి సందీప్ మాస్టర్ గెలిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, టాస్క్ లో అర్జున్ గెలవడం వల్ల ఇంటికి కొత్త కెప్టెన్ గా అర్జున్ ఎంపిక అయ్యాడు. దీంతో 7వ వారం కెప్టెన్ గా అర్జున్ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాడు. నిజానికి సందీప్ కెప్టెన్ అయి ఉంటే ఈవారం కూడా నామినేషన్స్ ని తప్పించుకునేవాడు.

ఇక (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ హౌస్ లో తేజకి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. శోభా పేరు ట్యాటూ వేసుకోమని చెప్పాడు. కానీ తేజ చాలాసేపు దీనిపై ఫైట్ చేశాడు. దీనికోసం తేజని టీజ్ చేస్తునే ఉన్నాడు బిగ్ బాస్. దీన్ని బట్టీ చూస్తే ఈవారం తేజని ఎలిమినేట్ చేస్తారా అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus