Bigg Boss 7 Telugu: ఆటగాళ్లని ఛాలెంజ్ చేసిన పోటుగాళ్లు..! లైవ్ లో జరిగిందేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం నామినేషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ 2.ఓ నుంచీ వచ్చిన కంటెస్టంట్స్ ని పోటుగాళ్లగా మార్చాడు బిగ్ బాస్. వాళ్లు ఆటగాళ్లని నామినేట్ చేశారు. అలాగే, ఆడగాళ్లు తిరిగి పోటుగాళ్లని సైతం నామినేట్ చేసి వారిలోని లోపాలని సైతం ఎత్తి చూపారు. ముఖ్యంగా వచ్చిన వాళ్లు అందరూ అమర్ ని టార్గెట్ చేశారు. అమర్ మిస్టేక్స్ ని చెప్తూ నామినేట్ చేశారు.

చేసినవన్నీ తప్పులే అయినపుడు అమర్ కూడా తలవంచుకుని నామినేషన్స్ ని యాక్పెప్ట్ చేశాడు. అలాగే, కొత్తగా వచ్చిన వాళ్లలో అశ్వినికి ఎక్కువగా ఓట్లు వేశారు. ఇక నామినేనేషన్స్ లో మూడు ఓట్లు వచ్చినా కూడా సందీప్ సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. స్పెషల్ పవర్ ద్వారా సందీప్ సేఫ్ జోన్ లోకి వచ్చాడు. దీంతో ఈవారం కూడా సందీప్ ఓటింగ్ లోకి రాలేదు. సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ని బిగ్ బాస్ నామినేషన్స్ చివర్లో పంపించాడు.

దీంతో అతి వీర భయంకరంగా అరుచుకుంటూ హౌస్ లోకి వచ్చాడు గౌతమ్. రాననుకున్నారా.. రాలేనని అనుకున్నారు. అశ్వద్ధామా ఈజ్ బ్యాక్ అంటూ వచ్చాడు. తేనె పూసిన కత్తిని గుండెలో దింపారు కదరా.. భూమి బద్దలు అయినా, ఆకాశం విరిగిపడినా అయినా కూడా ఈ అశ్వద్ధామ చావడు. అంటూ రెచ్చిపోయి మరీ అరిచాడు. అంతేకాదు, బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ప్రకారం గౌతమ్ సందీప్ ని సేఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఈవారం గౌతమ్ కూడా నామినేషన్స్ నుంచీ తప్పించుకున్నాడు.

నామినేషన్స్ అవ్వగానే శివాజీకి క్లాస్ పీకాడు. ఎంటర్ టైన్ చేయలేడు గౌతమ్ అన్నారు కదా, మరి మీరు ఫ్యాంట్ వేస్కోవట్లేదు ఇదేనా మీ ఎంటర్ టైన్మెంట్ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో శివాజీ నేను వంద సినిమాలు చేశాను షర్ట్ ప్యాంట్ లేకుండా కూడా చేశాను. ఇదేం పాయింట్ అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. నామినేషన్స్ కంటే కూడా ఇదే లొల్లి ఎక్కువైంది.

అసలు లైవ్ లో ఏం జరిగిందంటే, పోటుగాళ్ల నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత ఆటగాళ్ల నామినేషన్స్ పాయింట్స్ ని ఏమీ చూపించలేదు. కేవలం సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ని మాత్రమే చూపించారు. దీంతో లైవ్ చూసే ప్రేక్షకులకి విసుగు వచ్చింది. ఇక నామినేషన్స్ లో పోటుగాళ్లు కూడా ఐదు వారాలుగా ఆటగాళ్లు చేసిన తప్పులని ఎత్తి చూపుతూ నామినేట్ చేశారు. మరి ఈవారం (Bigg Boss 7 Telugu) ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు. ఆటగాళ్లు – పోటుగాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus