Jr NTR: తారక్ మూవీపై షాకింగ్ అప్ డేట్.. ఏంటంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈ సినిమా గురించి నెగిటివ్ వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి రావడంతో తారక్ అభిమానులు తెగ ఫీలయ్యారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా నుంచి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ నెలాఖరు నుంచి అనిరుధ్ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీ కానున్నారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన రత్నవేలు పని చేయనున్నారు. నవంబర్ నెల 12వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించి యువసుధ ఆర్ట్స్ నుంచి ప్రకటన రానుందని బోగట్టా. స్క్రిప్ట్ పనుల వల్ల ఇంతకాలం ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కాగా ఎట్టకేలకు ఆ పనులు పూర్తయ్యాయని బోగట్టా. తారక్ కు జోడీగా కియారా అద్వానీ, రష్మికలలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్30 రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలుకానుండగా ఈ సినిమా షూటింగ్ ను తారక్ వేగంగానే పూర్తి చేయనున్నారు. మరోవైపు సలార్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తారక్ సినిమాతో బిజీ కానున్నారు. ప్రశాంత్ నీల్ తారక్ సినిమాను భారీ లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నారు.

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలలో కథ, కథనం నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఈ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విషయంలో కూడా ఇదే రిపీట్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ సోలో హీరోగా ఇండస్ట్రీ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus