సూపర్ మెలోడీ సాంగ్ గా సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు సెకండ్ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, డిసెంబర్ 9న (సోమవారం) సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫామిలీ మెలోడీ సాంగ్ గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి సంబంధించి విడుదలైన పోస్టర్ కూడా ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే క్లాసీ సాంగ్ గా ఉండనుందని తెలియజేస్తోంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు.

ఈ పాటపై హైప్ క్రియేట్ చేసే నేపథ్యంలో తాజాగామరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో మహేష్ ఏదో చెబుతున్నట్లు.. విజయశాంతి ఎంతో శ్రద్దగా వింటూ ఆశ్చర్యపోతోన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ పాటైనా మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చల్లారుస్తుందో లేదో చూడాలి. ఇది కూడా బెడిసికొడితే దేవీ పరిస్థితి ఇక కష్టమే. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు థియేటర్లలోకి వచ్చేందుకు ఫిక్స్ అయింది. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు టీం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్, ఫాన్స్ కి ఫీస్ట్ గా, సంక్రాంతి ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్ గా ఉండనున్నాయి. జనవరి 11, 2020 న ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus