నిహారికకు పెళ్లి కబుర్లకు స్పెషల్ షో, ప్రోమో కూడా రెడీ..!

ఎలాగోలా కుటుంబ సభ్యులను ఒప్పించి హీరోయిన్ గా నటించడానికి పర్మిషన్ తెచ్చుకుంది నిహారిక. అయితే సక్సెస్ మాత్రం ఈమెను వరించలేదు. 2015 లో నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది నిహారిక. మొదటి చిత్రంలో ఈమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.సినిమా రిజల్ట్ ఫ్లాప్ అయినప్పటికీ..నటిగా నిహారిక సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఆ తరువాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.

‘సైరా’ సినిమాలో నటించినా ఈమెకు కలిసొచ్చిందేమీ లేదు. దాంతో తిరిగి తనకు కలిసొచ్చిన వెబ్ సిరీస్ లు, టీవీ షోలు చేసుకుంటూ వచ్చింది నిహారిక. అయితే ఇటీవల ఈమెకు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ కొడుకు జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతుంది నిహారిక. తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవినే ఈ సంబంధం కుదిర్చాడు. ఇదిలా ఉండగా.. వినాయక చవితి సందర్భంగా ప్రసారమయ్యే ‘బాపు బొమ్మకు పెళ్లి’ అనే స్పెషల్ షోలో తన పెళ్లికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకోబోతుంది నిహారిక.

జీ తెలుగులో ఈ షో ప్రసారం కాబోతుంది.అందుకు సంబంధించిన ప్రమో కూడా తాజాగా విడుదల అయ్యింది. ఈ స్పెషల్ షోకు నిహారిక తండ్రి నాగబాబు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ షోలో అనసూయతో పాటు పలువురు టీవీ నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus