యమ్ ఎస్ నారాయణ: బ్రహ్మానందం రికార్డు బద్దలు కొట్టిన కమెడియన్..!

  • April 16, 2020 / 04:29 PM IST

టాలీవుడ్ లో ఎం ఎస్ నారాయణది ఓ నవ్వుల అధ్యాయం. కమెడియన్ గా ఆయన పంచిన నవ్వులు తెలుగు ప్రేక్షకుల ఎప్పటికీ గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. కామెడీ చేయడంలో ఓ ప్రత్యేక శైలి కలిగిన ఎం ఎస్ నారాయణ రచయితగా పరిశ్రమకు పరిచయమై, అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. నవ్వుల రేడుగా పేరుగాంచిన ఎమ్ ఎస్ నారాయణ జయంతి నేడు. ఆంధ్రప్రదేశ్ నిడమానూరులో 1951 ఏప్రిల్ 16న ఆయన జన్మించారు. లెక్చరర్ గా జీవితం ప్రారంభించిన ఎమ్ ఎస్ నారాయణ సినిమాపై మక్కువతో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు. కెరీర్ ప్రారంభంలో గోస్ట్ రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేశారు.

నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న ఎం ఎస్ నారాయణకు 1996లో మోహన్ బాబు హీరోగా వచ్చిన పెదరాయుడు సినిమాలో ఆచారి అనే పాత్ర కొంచెం గుర్తింపు ఇచ్చింది. మానాన్నకు పెళ్లి, సమరసింహారెడ్డి, ఆనందం, నువ్వు నాకు నచ్చావ్,ఆది, ఇంద్ర,సొంతం సినిమాలు కమెడియన్ గా ఆయన్ని నిలబెట్టాయి. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మారిన తరువాత ఎం ఎస్ తీరిక లేకుండా సినిమాలు చేశారు. 20 ఏళ్లలో 700 చిత్రాలు చేసిన బ్రహ్మానందం గిన్నిస్ రికార్డుని ఎం ఎస్ నారాయణ 17ఏళ్లలో 700 చిత్రాలు చేసి బద్దలు కొట్టారు. కెరీర్ లో ఎం ఎస్ నారాయణ ఐదు నంది అవార్డ్స్ అందుకున్నారు.

ఏ పాత్రలో నైనా లీనమై నటించే ఎం ఎస్ తాగుబోతు పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఆ తరహా పాత్ర ఉందంటే ఏ దర్శకుడైన ఎం ఎస్ ని సంప్రదించేవారు. నవ్వుల చిరునామాగా పేరున్న ఎమ్ ఎస్ రేసు గుర్రం, పిల్ల జమీందార్, రచ్చ, బుజ్జిగాడు వంటి సినిమాలలో ఏడిపించే ఎమోషనల్ రోల్స్ కూడా చేశారు. ఎంత ఎదిగా స్నేహితులతో గడపడం, ఎప్పుడూ వారికి చేదోడు వాదోడుగా ఉండడం ఎమ్ ఎస్ కి ఇష్టమైన చర్య. తన చివరి రోజుల్లో కూడా ఎం ఎస్ నారాయణ తన ప్రాణమిత్రులను పిలిపించుకొని వారితో కొన్ని నిమిషాలు గడిపారట. తెరపై తెర వెనుక అందరినీ నవ్విస్తూ ఉండే ఎం ఎస్ నారాయణ 2015 జూన్ 23న సెలవంటూ వెళ్లిపోయారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus