Satya: ‘రంగబలి’ .. సత్య ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

నాగ శౌర్య హీరోగా ‘రంగబలి’ అనే సినిమా రూపొందింది. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘దసరా’ తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి. ‘ఛలో’ తర్వాత నాగ శౌర్య నుండీ ఓ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులైంది. ‘రంగబలి’ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాలో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయనే కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. జూలై 7 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్లో భాగంగా ‘రంగబలి’ యూనిట్ ఓ స్పూఫ్ ఇంటర్వ్యూని ప్లాన్ చేసింది.

ఇందులో పాపులర్ టాలీవుడ్ జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ కమెడియన్ సత్య కనిపించాడు. మొత్తం 5 మంది పాపులర్ జర్నలిస్టులను సత్యని ఇమిటేట్ చేసినట్టు.. ఓ ప్రోమోని కూడా విడుదల చేశారు. అది చూసి.. ఇద్దరు జర్నలిస్ట్ లు బాగా హర్ట్ అయ్యారని.. అందువల్ల ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేయడం లేదు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు ‘రంగబలి’ యూనిట్ సభ్యులు.

ఈ వీడియో స్టార్టింగ్లోనే ‘ జర్నలిస్ట్ ల పై ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని, కేవలం తమ సినిమా ప్రమోషన్ కోసం తప్ప.. వారిని కించపరచడానికి ఇలాంటి వీడియో చేయలేదని’ రాసుకొచ్చారు. అయితే ఈ వీడియో చూశాక చాలామంది నెటిజన్లు.. ‘హర్ట్ అయిన జర్నలిస్ట్ లు వీళ్ళే అయ్యుంటారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus