‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. ఫలితం అయితే అంచనాలను అందుకోలేదు. కానీ మహేష్ బాబు- త్రివిక్రమ్..లకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. దాదాపు 82 శాతం రికవరీ జరిగింది. అయితే సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రమోషన్ అనుకున్నట్టు జరగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయడానికి చిత్ర బృందం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి అనే విషయాన్ని చిత్ర బృందం ముందుగా ప్రాజెక్టు చేయలేకపోయింది.
పక్కా మాస్ సినిమా అని అభిమానులు ఎక్కువగా ఆశించి థియేటర్ కి రావడంతో వారికి నిరాశ ఎదురైనట్టు అయ్యింది. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా అంగీకరించారు. అయితే ‘గుంటూరు కారం’ లో చాలా సీన్లు డిలీట్ చేసినట్లు కూడా ఇన్సైడ్ టాక్ గట్టిగానే వినిపించింది. అందులో భాగంగా 2 పాటలని కూడా లేపేసినట్టు వార్తలు వినిపించాయి. అందులో ఒకటి శ్రీలీల- మహేష్..ల మధ్య ఉండే డ్యూయెట్ కాగా ఇంకోటి ఎమోషనల్ సాంగ్. ఈరోజు ఆ ఎమోషనల్ సాంగ్ ని ‘అమ్మ’ లిరికల్ సాంగ్ గా యూట్యూబ్ లో వదిలింది చిత్ర బృందం.
“ఏది మనదనుకుంటాం .. ఏది కాదనుకుంటాం
లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతాం
ఎంతకని దిగిపోతాం.. ఎంతకని దిగులవుతాం
రాని మామకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతాం” .. అంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ చాలా బాగున్నాయి.
ఈ పాటలోని ట్యూన్స్ ని సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా మాత్రమే వాడారు. సినిమాలో ఫుల్ సాంగ్ పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగా ‘రిలీజ్ కి ముందే ఈ పాటని యూట్యూబ్ లో వదిలి ఉంటే.. కచ్చితంగా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుండేది’ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ పాట వల్ల ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.
ఏది మనదనుకుంటాం .. ఏది కాదనుకుంటాం
లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతాంఎంతకని దిగిపోతాం.. ఎంతకని దిగులవుతాం
రాని మామకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతాం
– @ramjowritesఈ పాటని రిలీజ్ కి ముందే వదిలి ఉంటే సినిమా ప్రమోషన్ కి బాగా హెల్ప్ అయ్యి ఉండేది #GunturKaaram #AmmaSong… pic.twitter.com/zUB7uKxuUZ
— Filmy Focus (@FilmyFocus) January 26, 2024
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!