స్టార్‌ కపుల్‌తో ఒకేసారి కలసి నటిస్తున్న కుర్ర హీరోయిన్‌.. భలే ప్లానింగ్‌!

ఒకేసారి భార్యాభర్తలతో కలసి నటించే అవకాశం చాలా తక్కువమందికే వస్తుంది. అందులోనూ ఇద్దరు స్టార్‌ నటులు అయితే ఇంకా తక్కువగా ఆ ఛాన్స్‌ ఉంటుంది. అలాంటి ఛాన్స్‌ కొట్టేసింది యువ కథానాయిక శర్వరీ వాఘ్‌. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో చక్కటి అవకాశం ఆమెకు దక్కింది. తొలుత భార్య పక్కన నటించే అవకాశం రాగా.. ఇప్పుడు ఆ హీరోయిన్‌ (Heroine) భర్త పక్కన నటించే ఛాన్స్‌ సంపాదించింది.

Heroine

బాలీవుడ్‌లో స్టార్‌ కపుల్స్‌ చాలామంది ఉన్నారు. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా చర్చ జరుగుతున్న కపుల్‌ మాత్రం రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)  – ఆలియా భట్‌ (Alia Bhatt)  మాత్రమే. ఒకవైపు ‘జిగ్రా’ సినిమా వసూళ్ల పంచాయితీ నడుస్తుండటంతో ఆలియా భట్‌ వార్తల్లో ఉంది. ఇక ‘ధూమ్‌ 4’ సినిమాలో నటిస్తున్నాడు అని వార్తలు వచ్చేసరికి రణ్‌బీర్‌ కపూర్‌ పేరు వినిపిస్తోంది. ఈ ఇద్దరితోనే శర్వరీ వాఘ్‌ నటిస్తోంది.

ప్రస్తుతం ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ అనే సినిమాలో నటిస్తోంది. యశ్‌రాజ్‌ స్పై సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శర్వరీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. మరోవైపు యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కున్న ‘ధూమ్‌ 4’లోనూ శర్వరీని తీసుకున్నారని టాక్‌ నడుస్తోంది. కియారా అడ్వాణీతో కలసి ఆమె స్క్రీన్ షేర్‌ చేసుకోనుంది అని చెబుతున్నారు.

ప్రస్తుతం ‘ధూమ్‌ 4’ సినిమా స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. అందులో రణ్‌బీర్‌ సరసన నటించడానికి కియారా (Kiara Advani), శర్వరీతో చర్చలు జరిగాయి అనేది లేటెస్ట్‌ అప్‌డేట్? త్వరలో ఈ విషయాల్ని అధికారికంగా వెల్లడిస్తారట. ఇక అనిల్‌ కపూర్ (Anil Kapoor) , బాబీ డియోల్‌ (Bobby Deol) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా (Heroine) శర్వరీ మారితే.. ‘ధూమ్‌ 4’కి మరింత కలరింగ్‌ యాడ్‌ అయినట్లే.

సినిమాల రిలీజ్‌ డేట్లను శాసిస్తున్న ఓటీటీలు.. ఇలానే కొనసాగితే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus