సినిమాల రిలీజ్‌ డేట్లను శాసిస్తున్న ఓటీటీలు.. ఇలానే కొనసాగితే..!

  • October 22, 2024 / 09:29 PM IST

ఏదైనా సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయిన తర్వాత ఓటీటీల్లోకి (OTT ) వస్తుంది. కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత కొన్ని సినిమాలు నేరుగా థియేటర్లలోనే వచ్చేస్తున్నాయి. ఎందుకు అని అడిగితే.. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని ఉద్దేశించి చేసింది అంటున్నారు. నిజానికి అలాంటివాళ్లు ఉంటారా అంటే ఏమో అనే సమాధానమే వస్తుంది. అయితే ఇప్పుడు టాపిక్‌ ఇది కాదు. సినిమా రిలీజ్‌ డేట్‌ను ఓటీటీలు హ్యాండిల్‌ చేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే అని టాలీవుడ్‌ వర్గాల ముచ్చట.

OTT

రీసెంట్‌ టైమ్స్‌లో సినిమాల రిలీజ్‌ల గురించి వింటున్నప్పుడల్లా వినిపిస్తున్న అంశం ‘ఓటీటీ ఏం చెబుతోంది అంటే..’. సినిమా రిలీజ్‌ ఈ విషయంలో ఆ సినిమాను అప్పటికే కొనుక్కున్న ఓటీటీ సంస్థలు ఇన్వాల్వ్‌ అవుతున్నాయి అని. ఎందుకు ఇన్వాల్వ్‌ అవుతున్నాయి అనే ప్రశ్న కంటే.. ఎవరు ఆ అవకాశం వచ్చారు అనేది ఇక్కడ ముఖ్యం. ఇచ్చింది మన నిర్మాతలే. తొలుత అందరూ కలసి అనుకున్న నియమాల్ని పక్కన పెట్టి సినిమాల్ని ముందే అమ్మేస్తున్నారు. ఆ విషయం పోస్టర్ల మీద, టైటిల్‌ కార్డ్స్‌లో వేసేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. సంక్రాంతి సినిమాల విషయంలో రిలీజ్ డేట్ల మార్పులు చర్చ ఓ పక్క జోరుగా జరుగుతుంటే.. మరో పక్క ఆ సినిమాల డేట్స్‌ మారుతున్నందుకు ఓటీటీ ధరల్లో మార్పులు వస్తున్నాయి అంటున్నారు. అంటే.. డిసెంబరులో రావాల్సిన సినిమాలు జనవరికి అంటే ఒక నెల ఆలస్యంగా వస్తుండేసరికి ముందు అనుకున్నంత ఇవ్వం అని ఓటీటీలు చెబుతున్నాయట. దీంతో తలలు పట్టుకోవడం నిర్మాతల వంతు అయింది అంటున్నారు.

సంక్రాంతికి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి బాగా ఉత్సాహం చూపిస్తారని నిర్మాతలు అంటుంటే.. ముందుగా సినిమా తెచ్చేసి ఆ టైమ్‌కి తాము ఓటీటీల్లోకి తెచ్చుకుంటే తమకు సబ్‌స్క్రిప్షన్లు పెరుగుతాయని ఓటీటీలు అనుకుంటున్నాయట. దీంతో ఓటీటీలు సంక్రాంతి సినిమాల విషయంలో గట్టిగా పట్టు పట్టాయి అని చెబుతున్నారు. దీంతో ఓటీటీ (OTT) విషయంలో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనేలా పరిస్థితి మారిందని టాక్‌.

ఎన్నో కష్టాలు.. అవమానాల ఫలితం ఇది.. త్రిప్తి డిమ్రి ఎమోషనల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus