బన్నీ- త్రివిక్రమ్ మూవీ అప్డేట్ షురూ..?

అల్లు అర్జున్ 19 వ చిత్రం త్రివిక్రమ్ త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీతా ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడట. ఇటీవల ఈ లుక్ కు సంబంధించి ఓ ఫొటో షూట్ ను కూడా నిర్వహించారట. ఇందులో నుండీ ఓ లుక్ ను ఫిక్స్ చేసి… బన్నీ పుట్టిన రోజున అంటే ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నారని సమాచారం.

త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలను నిర్వహించి .. ఏప్రిల్ 24 నుండీ రెగ్యులర్ షూటింగు ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. తమన్ సంగీతమందించబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుందని. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ ఛితంలో పుష్కలంగా ఉంటుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక.. నానితో ‘ఎం.సి.ఏ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడట అల్లు అర్జున్. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus