Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

విక్టరీ వెంకటేష్ హీరోగా  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియెషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ కి జోడీగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా. ఎందుకంటే ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడు.. ‘ఇదేదో క్రైమ్ కామెడీ జోనర్ మూవీ అయ్యుంటుంది’ అనే ఫీలింగ్ కలిగించింది.

Aadarsha Kutumbam AK 47

అందుకే ‘ఆదర్శ కుటుంబం’ పై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆడియన్స్. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా వెంకటేష్ పాత్రని పరిచయం చేస్తున్న చిన్న గ్లింప్స్ వదిలారు. వెంకటేష్ పాత్ర పేరు చిట్టిబాబు అని రివీల్ చేశారు. అతన్ని ఓ ఫ్యామిలీమెన్ గా పరిచయం చేస్తూనే.. ఇంట్లో తన భార్య చేసే పనులన్నీ చేసేవాడని తెలుపుతూ సినిమాలో ఎలాంటి హ్యూమర్ ఉండబోతుందో చెప్పకనే చెప్పారు.

ఆ వెంటనే ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్న నారా రోహిత్ తో ‘ఆదర్శ కుటుంబం’ అంటూ చెప్పించారు. అటు తర్వాత ట్రైన్లో పారిపోతున్న చిట్టిబాబు ఫ్యామిలీని గమనించవచ్చు. వాళ్ళ మొహాలపై గాయాలు చూస్తుంటే.. ఏదో మర్డర్ చేసి ఊరు వదిలి వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ గ్లింప్స్ ను బట్టి చూస్తే.. దర్శకుడు త్రివిక్రమ్ చాలా వరకు అనిల్ రావిపూడి స్టైల్ ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో త్రివిక్రమ్ మాటల మ్యాజిక్ ఉంటే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేయడం ఖాయం.

‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus