Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు
- November 4, 2026 / 07:25 AM ISTByPhani Kumar
విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47). శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థపై సూర్య దేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన కొత్తలో.. మంచి హైప్ ఉండేది. అయితే సినిమా అనేక సార్లు వాయిదా పడటం వల్ల.. జనాల్లో ఆసక్తి తగ్గింది.
Aadarsha Kutumbam AK 47

మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 9.4 cr |
| సీడెడ్ | 2.10 cr |
| ఉత్తరాంధ్ర | 2.19 cr |
| ఈస్ట్ | 1.10 cr |
| వెస్ట్ | 1.01 cr |
| కృష్ణా | 1.35 cr |
| గుంటూరు | 1.25 cr |
| నెల్లూరు | 0.86 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 19.26 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.23 cr |
| ఓవర్సీస్ | 6.41 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 28.9 cr (షేర్) |
‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరోవైపు భారీ వర్షాలు. అయినప్పటికీ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ 4వ రోజు డౌన్ అయిపోయింది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.28.9 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.55 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.32.1 కోట్లు కలెక్ట్ చేయాలి.
4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’















