వెంకటేష్ ‘ఆడవారి మాటలకు..’ కి 18 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే!

వెంకటేష్ (Venkatesh Daggubati), త్రిష (Trisha) కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ (Aadavari Matalaku Arthale Verule). ‘లక్ష్మీ’ వంటి మాస్ సినిమా తర్వాత వెంకటేష్ చేసిన ఓ క్లాస్ సినిమా ఇది.’7/G బృందావన కాలనీ’ తో తెలుగులో కూడా ఓ మంచి హిట్టు కొట్టిన శ్రీ రాఘవ అలియాస్ సెల్వ రాఘవన్ దీనికి దర్శకుడు.’శ్రీ సాయి దేవా ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై ఎన్.వి.ప్ర‌సాద్ – శానం నాగ అశోక్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ‌న్ శంక‌ర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Aadavari Matalaku Arthale Verule Collections:

బాల‌మురుగ‌న్ (B. Balamurugan) సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 2007 ఏప్రిల్ 27న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. రిలీజ్ రోజున ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ శ్రీ రాఘవ నేచురల్ టేకింగ్, వెంకటేష్ పెర్ఫార్మన్స్ కలగలిపి ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  6.80 cr
సీడెడ్  1.93 cr
ఉత్తరాంధ్ర  2.59 cr
ఈస్ట్  0.92 cr
వెస్ట్  0.97 cr
గుంటూరు  1.63 cr
కృష్ణా  1.57 cr
నెల్లూరు  0.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   0.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  18.10 cr

‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రం రూ.13.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.18.10 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.3 కోట్ల లాభాలు మిగిల్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీల్లో ఎగబడి చూస్తూనే ఉన్నారు.

 ‘దమ్ము’ కి 13 ఏళ్ళు… రిలీజ్ టైంలో అంత జరిగిందా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus