Dammu: ‘దమ్ము’ కి 13 ఏళ్ళు… రిలీజ్ టైంలో అంత జరిగిందా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను (Jr NTR)  మొదట నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పెద్ద స్టార్ అయ్యాడు. అయినా వెంటనే ఫ్యామిలీ అతన్ని చేరదీసింది లేదు. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత 2009 లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ.. 2008 లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి.. రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు.

Dammu

దీంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నట్టు అప్పుడు అంతా భావించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి కూడా సినీ గ్లామర్ అవసరం అని భావించి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపారు. ‘యమదొంగ’ తో (Yama Donga) ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ‘కంత్రి’ (Kantri) కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది. అందుకే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ ప్లస్ అవుతుంది అనుకున్నారు. కానీ అతను ఎక్కడైతే ప్రచారం చేశాడో.. ఆ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. అయినప్పటికీ ఎన్టీఆర్ కి టీడీపీ అండగా నిలబడింది.

‘అదుర్స్’ (Adhurs) ‘బృందావనం’ సినిమాలకి బాలయ్య,చంద్రబాబు కూడా ప్రచారం చేయడం జరిగింది. ‘శక్తి’ ‘ఊసరవెల్లి’ వరకు కూడా ఎన్టీఆర్ కు నందమూరి అభిమానులు, బాలయ్య సపోర్ట్ ఉంది. కానీ ‘దమ్ము‘ (Dammu) సినిమాకి లెక్కలు మారిపోయాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ నుండి సెపరేట్ అవ్వడం ఎన్టీఆర్ కి… ఫ్యామిలీతో సెపరేట్ అయ్యేలా చేసింది అని చెప్పాలి.

దీంతో ‘దమ్ము’ సినిమా రిలీజ్ టైంలో ‘ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దు’ అంటూ సీడెడ్, విజయవాడ పరిసరాల్లో ఎక్కువగా ఉండే నందమూరి అభిమానులకు కొందరు లెటర్స్ రాయడం కూడా జరిగింది. పైగా ఆ సినిమాలో ‘ప్రజలు పిలిస్తే రాజకీయాల్లోకి రావడం గ్యారంటీ’ అన్నట్టు ఎన్టీఆర్ సంబంధం లేకపోయినా కొన్ని పొలిటికల్ డైలాగులు వేసుకున్నారు. ఈ సినిమా కంటెంట్ కి యావరేజ్ రిజల్ట్ దగ్గర ఆగిపోవడానికి కారణం అదే అని అంతా అంటుంటారు. 2012 ఏప్రిల్ 27న ‘దమ్ము’ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus