ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ.. ల గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!

ఆది పినిశెట్టి అందరికీ సుపరిచితమే. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి. టాలీవుడ్లో కూడా ఇతను చాలా సినిమాల్లో నటించాడు. ‘ఒక వి చిత్రం’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇతను ‘వైశాలి’ ‘ఏకవీర’ ‘గుండెల్లో గోదారి’ ‘మలుపు’ ‘సరైనోడు’ ‘నిన్ను కోరి’ ‘మరకతమణి’ ‘రంగస్థలం’ ‘నీవెవరో’ ‘అజ్ఞాతవాసి’ ‘యూటర్న్’ ‘ది వారియర్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా, విలన్ గా, విలక్షణ నటుడిగా ఆది పినిశెట్టి మంచి మార్కులు వేయించుకున్నాడు.

వీళ్ళ ఫ్యామిలీ తమిళనాడులో సెటిల్ అయినప్పటికీ వీళ్ళు తెలుగు వాళ్ళే అన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో ఇతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మేలో ఇతను కోలీవుడ్ హీరోయిన్, నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ఈ కపుల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

త్వరలోనే ఆది- నిక్కీ లు తల్లిదండ్రులు కాబోతున్నారట. కోలీవుడ్ మీడియా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అది కారికంగా ఈ జంట ఇంకా ప్రకటించలేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మే 18, 2022న వీరి పెళ్లి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.

నిక్కీ గల్రాని ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రాని చెల్లెలు అన్న సంగతి తెలిసిందే. ‘మలుపు’ సినిమా నుండి ఆది- నిక్కీ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ వంటి వారు ఆది పెళ్ళిలో సందడి చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus