వంటవాడిగా ఆది పినిశెట్టి

కెరీర్ మొదలెట్టినప్పట్నుంచి కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకొన్న ఆది పినిశెట్టి “మృగం, వైశాలి” చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకోవడంతోపాటు తెలుగులో “సరైనోడు” చిత్రంతో విలన్ గానూ మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఆ తర్వాత “నిన్ను కోరి” చిత్రంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకొన్నాడు. ఇటీవల సూపర్ డిజాస్టర్ అయిన “అజ్ణాతవాసి” చిత్రంలోనూ నటుడిగా తన మార్క్ వేయగలిగాడు. అతి త్వరలోనే “రంగస్థలం” చిత్రంతోనూ వైవిధ్యమైన పాత్రలో అలరించనున్నాడు.

ఇకపోతే.. ఒకపక్క సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేస్తూనే మధ్యమధ్యలో హీరోగానూ తన లక్ ను పరీక్షించుకొంటున్నాడు. తాజాగా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒక సినిమా సైన్ చేశాడు. కోన వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రంలో కథానాయికలుగా తాప్సీ, రీతికా సింగ్ నటిస్తుండగా.. ఈ చిత్రంలో ఆది చెఫ్ గా నటించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో నడుస్తోంది. షూటింగ్ కోసమని స్టూడియోలో స్పెషల్ సెట్ కూడా వేశారు. ఈ షెడ్యూల్ లో రీతికా సింగ్ కూడా పాల్గొంటుంది. స్టోరీ డ్రివెన్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ కాన్సెప్ట్ ఫిలిమ్ మేకింగ్ పరంగానూ సెన్సేషన్ క్రియేట్ చేయనుందని సమాచారం. మరి ఈ చిత్రంతో కథానాయకుడిగా ఆది పినిశెట్టి రేంజ్ ఏమేరకు పెరుగుతుందో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus