Tiger Nageswara Rao: ఇలాంటి పాత్రలో నటించడం చాలా గౌరవంగా ఉంది!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జానీ సినిమాలో చివరిగా నటించారు. ఈ సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రేణు దేశాయ్ తన భర్తతో విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ చేపడుతూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే పిల్లలు ప్రస్తుతం పెద్ద కావడంతో ఈమె కూడా తిరిగి సినిమాలలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా తనకు సరైన పాత్ర దొరికితే తప్పకుండా సినిమాలలోకి వస్తానని ఇదివరకే ఈమె తెలియజేశారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఈమె హేమలత లవణం అనే పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ పాత్రలో రేణు దేశాయ్ నటించబోతున్నారు అనే విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా (Tiger Nageswara Rao) అక్టోబర్ 20వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె నటిస్తున్నటువంటి హేమలత లవణం పాత్ర గురించి తన కూతురు అభిప్రాయాలను తెలియజేశారు.

హేమలత లవణం పాత్రలో నటించడంతో తన కూతురు ఆద్య ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. చాలా మంది నటీనటులు వారి వయసుకు తగ్గట్టు పాత్రలలో నటించరు కానీ మీరు మాత్రం మీ వయసుకు తగ్గ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. మీరు ఈ పాత్రలో నటించడం నాకు చాలా గౌరవంగా ఉంది అంటూ తన కూతురు ఎంతో సంతోషం వ్యక్తం చేసింది అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus