అప్పట్లో ‘గజినీ’ సినిమాతో తెలుగునాట పాపులారిటీ దక్కించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇక్కడ కూడా అతడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అప్పటినుండి ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ సినిమాలేవీ కూడా ఆశించిన ఫలితానని అందుకోలేకపోయాయి. ‘సెవెన్త్ సెన్స్’, ‘రాక్షసుడు’ లాంటి సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి. ’24’ సినిమా ఓకే అనిపించినా.. సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. కొద్దిరోజుల క్రితం వచ్చిన ‘ఎన్జీకే’ సినిమా సూర్య మార్కెట్ ని పూర్తిగా తగ్గించేసింది.
తెలుగు రాష్ట్రాలలో సూర్య స్వయంగా సినిమాను ప్రమోట్ చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగులో సూర్య మార్కెట్ పడిపోయిందని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అసలు ఈ సినిమా ఓటీటీ విడుదల చేయకుండా థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే మరింత పెద్ద సక్సెస్ అయ్యేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న అమెజాన్ ప్రైమ్ కి ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఊరట కలిగించింది.
ఈ సినిమా సక్సెస్ కావడంతో సూర్య ఈజ్ బ్యాక్ అంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ‘గజినీ’ తరువాత సూర్యకి ఆ రేంజ్ హిట్ ఇచ్చిన సినిమా ఇదేనంటూ కొనియాడుతున్నారు. ఈ విజయం సూర్య తెలుసు మార్కెట్ ని ఎన్నో రెట్లు పెంచడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!