Aamir Khan: కూతురు లైఫ్‌లో స్పెషల్‌ డేట్‌ను రివీల్‌ చేసిన స్టార్‌ హీరో!

ప్రతి తండ్రి కచ్చితంగా ఏడ్చే రోజు ఒకటి వస్తుంది… అదేంటో చెప్పుకోండి చూద్దాం! అందరూ ఆ రోజు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతారు. మీరు ఆ రోజు ‘కూతురు పెళ్లి’ అని మీరు అనుకుంటే.. కచ్చితంగా కరెక్ట్‌ అని చెప్పొచ్చు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని పెళ్లి చేసి వేరే ఇంటికి పంపే క్రమంలో ప్రతి తండ్రి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటారు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌పెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ జీవితంలో అలాంటి రోజు వచ్చేసింది.

అవును, ఆయన గారాలపట్టి ఐరా ఖాన్ పెళ్లి తేదీ ఫిక్స్‌ అయ్యింది. అదేంటి పెళ్లి డేట్‌ అని చెప్పకుండా.. ఈ ఏడుపులు పెడబొబ్బల గురించి ఎందుకు ప్రస్తావించారు అని అనుకుంటున్నారు. ఆ మాటలు మేం ప్రస్తావించలేదు. ఐరా ఖాన్‌ పెళ్లి గురించి చెబుతూ ఆమిర్ ఖాన్‌ అలా మాట్లాడాడు మరి. ఐరా ఖాన్‌, నుపుర్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కొన్ని నెలల క్రితం అఫీషియల్‌గా చెప్పారు కూడా.

కరోనా సమయంలో పరిచయం అయిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ ఇంటి వాళ్లు అవ్వడానికి ముహూర్తం పెట్టేశారట. వచ్చే ఏడాది జనవరి 3న ఐరా – నుపుర్‌ వివాహం చేయాలని నిర్ణయించారట. ఐరా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నుపుర్‌ బాసటగా ఉన్నాడు అంటూ నాటి విషయాన్ని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. ఇక పెళ్లి రోజు గురించి మాట్లాడుతూ.. ఐరా వివాహం సమయంలో నేను భావోద్వేగానికి లోనవుతాను అని సగటు తండ్రిలానే చెప్పాడు.

జనవరి 3న నేను ఏడుస్తాను. బాగా ఏడుస్తాను. అందుకే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నా సన్నిహితులకు ఇప్పటికే చెప్పేశాను. సంతోషాన్ని, బాధను కంట్రోల్‌ చేసుకోలేను. అందుకే ఆ రోజు నేను కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటాను అని ఆమిర్‌ చెప్పాడు. ఆమిర్‌ ఖాన్‌ – రీనాకు ఐరా జన్మించంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో (Aamir Khan) ఆమిర్‌ – రీనా విడిపోయారు. ఇక ఐరా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నుపుర్‌ ఆమెకు తోడుగా నిలిచి మామూలు మనిషి అయ్యేందుకు సాయపడ్డాడట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus