Aamir Khan, Kiran Rao: అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ విడాకులు

  • July 3, 2021 / 01:46 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అమీర్ ఖాన్ మరోసారి విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రెండవ భార్య కిరణ్ రావ్ తో గత 15ఏళ్ళుగా సాఫీగా కొనసాగుతున్న దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ వేశారు. అమీర్ ఖాన్ మొదట హీరోయిన్ రీనా దత్తాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రీనా దత్తాతో 16 ఏళ్ళ వరకు కలిసి ఉన్న అమీర్ ఖాన్ చివరికి 2002లో ఆ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్నాడు.

అనంతరం లాగాన్ సినిమాకు సహాయక దర్శకురాలిగా పని చేసిన కిరణ్ రావుతో ప్రేమలో పడ్డారు. డేటింగ్ అనంతరం ఆమెకు మరింత దగ్గరైన అమీర్ ఖాన్ 2005లో వివాహం చేసుకున్నారు. వీరు సర్రోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ కు జన్మనిచ్చారు. ఇక ఇన్నాళ్లకు వ్యక్తిగత అభిప్రాయ బేధాలతో విడిపోవడం మీడియాలో వైరల్ గా మారింది. ఇక విడిపోతున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చిన అమీర్ ఖాన్ 15 సంవత్సరాల దాంపత్య జీవితంలో అన్ని రకాల మంచి అనుభవాలను పంచుకొన్నామని అంటూ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నట్లు చెప్పారు.

అంతే కాకుండా భార్యాభర్తలుగా కాకుండా మా బిడ్డకు మంచి తల్లితండ్రులుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక రెండు వారాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని వేరువేరుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాతే చెప్పాలని అనుకున్నట్లు కిరణ్ రావ్ వివరణ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే కలిసి ప్రొడక్షన్ వర్క్ అలాగే పానీ ఫౌండేషన్ ను కొనసాగించనున్నట్లు తెలిపారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus