సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా రచ్చ జరుగుతోంది. సున్నితమైన అంశాలను టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ మధ్య పెళ్లి బట్టల బ్రాండ్ కోసం అలియా భట్ తో తీసిన ‘కన్యాదాన్’ యాడ్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. అది మరిచిపోకముందే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ఓ యాడ్ పై తీవ్ర దుమారం నడుస్తోంది.
ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్స్ కంపెనీ యాడ్ ఒకటి ఈ మధ్య విడుదలైంది. ‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ టైర్ల యాడ్ ను ప్రమోట్ చేశారు. అయితే ఆమిర్ ఖాన్ ఈ యాడ్ లో నటించడం, పైగా తమ మతాన్ని కించపరిచే విధంగా యాడ్ ను డిజైన్ చేయడంతో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అవి తారాస్థాయికి చేరగా.. సీయట్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో గోల చేస్తున్నారు.
ఈ యాడ్ లో నటించినందుకు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని.. యాడ్ ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇలాంటి సున్నితమైన అమాశాలపై అనుచిత ట్వీట్లు వేశాడని.. ఆ సమయంలో బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాలను, పండుగలను కించపరిచేలా యాడ్ తీయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!