Aamir Khan: అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ మధ్యలో ఆ హీరోయిన్?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఎంతగానో గుర్తింపు అందుకున్న అమీర్ ఖాన్ మరోసారి విడాకులు తీసుకోవడంతో మరొక కొత్త విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఓ వర్గం వారు అదే పనిగా ట్రోల్ చేస్తుండడం కూడా మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకే రీనా దత్తతో 15ఏళ్ళ సంసారానికి ఎండ్ కార్డ్ పెట్టిన అమీర్ మరోసారి కిరణ్ రావుతో కూడా దాదాపు అంతే టైమ్ స్పెండ్ చేశాడు. 2005లో చాలా సింపుల్ గా కిరణ్ రావ్ ను పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ మళ్ళీ 16 ఏళ్లకు ఆమె నుంచి దూరమయ్యాడు.

అసలు కారణం ఏమిటనే విషయంలో ఒక అనుమానం అయితే బలంగా వినిపిస్తోంది. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది నుంచి బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఫాతిమా ఎప్పుడు ముంబైకి వచ్చినా కూడా డైరెక్ట్ గా అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడం అలాగే పార్టీలకు కూడా తరచుగా వెళ్లడంతో విషయం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. అంబానీ ఇచ్చిన ఒక పార్టీలో కిరణ్ రావుతో కాకుండా ఫాతిమాను తీసుకెళ్లడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు సడన్ గా కిరణ్ రావ్ తో తెగదెంపులు చేసుకోవడానికి కారణం కూడా ఫాతిమా అని టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతం ఫాతిమాకు 29 ఏళ్ళు కాగా అమీర్ ఖాన్ కు 56 ఏళ్ల వయసు. దంగల్ అనంతరం అమ్మడు వెంటనే థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో అమీర్ ఖాన్ కు జోడిగా కూడా నటించింది. ఇక వీరి మధ్యలో ఎదో నడుస్తోందని వస్తున్న రూమర్స్ పై క్లారిటీ రావాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus