Aamir Khan: ‘మహాభారతం’ స్టార్ట్‌ చేస్తారట.. కానీ ఆయన ఉంటారో లేదో తెలియదట!

ఇండియన్‌ సినిమాలో రామాయణం, మహాభారతం లాంటి సినిమాలను తీయాలని చాలామంది దర్శక నిర్మాతలు, హీరోలు, నటులు చాలా ఏళ్లుగా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో కొంతమంది ప్రయత్నాలు విరమించుకోగా, మరికొందరు అదిగో ఇదిగో అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి అలాంటి సినిమాలు తీయడానికి చాలా ఏళ్లు పడుతుంది, దానికి తగ్గ పనులు చేయడానికి కూడా. ఇలాంటి వారిలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కూడా ఉన్నాడు. అవును ‘మహాభారతం’ రూపొందించడం తన కల అని ఆమిర్‌ ఖాన్‌ చాలా ఏళ్లుగా చెబుతున్నాడు.

Aamir Khan

తనకున్న పెద్ద ఆశయాల్లో అదీ ఒకటని చాలాసార్లు చెప్పారు. తాజాగా మరోసారి ఆయన ‘మహాభారతం’ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. భారతీయ ఇతిహాసానికి తాను ప్రాణం పోయాలనేది తన ఆలోచన అని ఆమిర్‌ మరోసారి స్పష్టతనిచ్చాడు. ఈ మేరకు ప్రీప్రొడక్షన్‌ పనులు త్వరలో మొదలవుతాయని గుడ్‌ న్యూస్‌ చెప్పుకొచ్చారాయన. ‘మహాభారతం’ ఇతిహాసాన్ని నేటితరానికి అందించాలనేదే నా కల.

ఈ ఏడాదే పనులు ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఈ సినిమా రైటింగ్‌కు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. మొత్తం కథను ఒకే సినిమాలో చూపించలేం. అందుకే సిరీస్‌లుగా సినిమా చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఎవరూ ఊహించని భారీస్థాయిలో సినిమా రానుంది. ఈ సినిమా కోసం చాలామంది దర్శకులు పని చేస్తారు. మొత్తం స్టోరీ సిద్ధమయ్యాక ఏ పాత్రకు ఎవరు సరిపోతారో చూసుకొని అప్పుడు నటీనటులను ఎంపిక చేస్తాం అని చెప్పారు.

అలాగే తాను ఈ సినిమాలో నటిస్తానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను అని షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు ఆమిర్‌. దీంతో అంత పెద్ద ఆశయం పెట్టుకుని నటిస్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోవడం ఏంటి అనే మాట ఇప్పుడు బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ రూ.1000 కోట్ల బడ్జెట్‌ అవ్వొచ్చని కొన్నేళ్ల క్రితం ఆమిర్‌ చెప్పాడు. కానీ ఇప్పుడు లెక్క చూస్తుంటే రూ. 1000 కోట్లకు లెక్క దాటేలలా ఉంది.

మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus