Nithya Menen: నేషనల్‌ అవార్డుపై పెద్ద ఎత్తున విమర్శలు.. సూపర్‌ రిప్లై ఇచ్చిన నిత్య

నిత్య మీనన్‌ (Nithya Menen) ,.. ఇప్పుడు జాతీయ ఉత్తమనటి. ‘తిరుచిత్రంబళం’ (Thiruchitrambalam)  సినిమాకుగాను ఆమెకు ఇటీవల ఆ అవార్డును ప్రకటించారు. అయితే ఆమెకు అవార్డు రావడం నచ్చనివాళ్లు.. గత కొన్ని రోజులుగా ఆమెను తెగ విమర్శిస్తున్నారు. అసలు ఆ సినిమాకు, ఆ కథకు అందులో నటించిన ఆమెకు మీరు అవార్డు ఇవ్వడం ఏంటి అనేది ఆ నెటిజన్ల వాదన. దీనికి నిత్య తాజాగా సూపర్‌ రిప్లై ఇచ్చింది. ఇప్పుడు ఆ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Nithya Menen

అవార్డులను ఆశించి సినిమాలను ఎంచుకునే నటిని తాను కాదు అంటూ తన మీద వస్తున్న పుకార్లను ఉద్దేశించి ఘాటుగానే స్పందించింది నిత్యా మీనన్‌. జాతీయ అవార్డు గెలుచుకునేంత స్థాయి సినిమాలోని శోభన పాత్రకు లేదని కొంతమంది సోషల్‌ మీడియాలో డిస్కస్‌ చేస్తున్నారు. సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు లేవు.. రొమాంటిక్‌ కామెడీ డ్రామా జోనర్‌లో రూపొందిన సినిమాకు జాతీయ అవార్డు అవసరమా అని కూడా అంటున్నారు అని నిత్య చెప్పింది.

అయితే వాళ్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. యాక్షన్‌ సినిమాల స్క్రిప్ట్‌లను ఎవరైనా రాయగలరు. కామెడీ కథల్ని రాయడం అంత సులభం కాదు. ఈ తరహా సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర నిరూపించింది అని నిత్య చెప్పింది. జోనర్‌, కథ లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా పాత్రను, నటనను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి థ్యాంక్యూ అని నిత్య చెప్పింది.

ఇక తాను మిత్రులతో రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుండగా.. ధనుష్‌ (Dhanush) ఫోన్‌ చేసి ‘కంగ్రాట్స్‌.. నీకు జాతీయ అవార్డు వచ్చింది’’ అని చెప్పాడట. అయితే ఆయన జోక్‌ చేస్తున్నాడని నిత్య అనుకుందట. అవార్డు ప్రకటించినప్పటి నుండి వరుసగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయని, నాకు అవార్డు వస్తే సంతోషించే వాళ్లు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యానికి గురయ్యానని నిత్య చెప్పింది. ఈ విజయాన్ని తమ విజయంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అని నిత్య ఆనందపడిపోతోంది.

షాకిస్తున్న భాగ్య శ్రీ రెమ్యునరేషన్.. ఎన్నాళ్ళు సాగుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus