ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు హిట్లు కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. ఒక్క షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తప్ప సల్మాన్ ఖాన్ (Salman Khan) నుంచి అక్షయ్ కుమార్ (Akshay Kumar) వరకు అందరూ ఒక్క సక్సెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు సౌత్ ఇండియన్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంచి కాన్సెప్ట్‌లతో అందరికీ నచ్చేలా సినిమాలు తీస్తున్నారు.
Aamir Khan, Vamshi Paidipally:
ముఖ్యంగా మన టాలీవుడ్ డైరెక్టర్లు మంచి చిత్రాలతో అలరిస్తున్నారు. అందుకే ధనుష్ (Dhanush) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వంటి ఇతర భాషల హీరోలు సైతం మన దర్శకులతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. తాజాగా బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) సైతం వారి బాటే పట్టాడు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ స్టార్ హీరో ‘సీతారే జమీన్ పర్’తో పాటు, ‘లాహోర్ 1947’ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంతేకాదు, రజనీకాంత్ (Rajinikanth) , నాగార్జున(Nagarjuna) – ఉపేంద్ర తో (Upendra) కలిసి ‘కూలీ’ (Coolie) అనే తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.
ఇదే సమయంలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇదివరకు ‘పీకే’, ‘3 ఇడియట్స్ (3 Idiots) ‘ వంటి ఆయన డబ్బింగ్ సినిమాలు దక్షిణాదిలో మంచి విజయం సాధించడంతో, ఆయనకు ఇక్కడ కూడా భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, అలాగే సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని నమ్మడం వల్ల ఆయన సౌత్ ఫిలిమ్స్ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నాడు.
ఈ సినిమా కథలు, కొత్త ట్రెండ్స్‌ను యాక్టర్ బాగా మెచ్చుకుంటున్నాడు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో (Dil Raju) కూడా కొంతకాలంగా ఆమిర్ చర్చలు జరిపాడు. ఈ నేపథ్యంలోనే ‘ఊపిరి’ (Oopiri) , ‘మహర్షి’ (Maharshi) , ‘వారిసు’ (Varisu) వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఆమిర్‌కు ఒక కథ వినిపించారట. కథ నచ్చడంతో ఆమిర్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.జనవరి చివరి వారంలో స్క్రిప్ట్‌పై తుది చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.
ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. దిల్ రాజు తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. ‘జెర్సీ’ (Jersey), ‘హిట్’ (HIT) రీమేక్‌లు దిల్ రాజుకు బాలీవుడ్‌లో అంతగా కలిసి రాకపోయినా, ఆమిర్ ఖాన్‌తో చేస్తున్న ఈ కొత్త సినిమా ఆయనకు, ముఖ్యంగా బాలీవుడ్‌లో ఒక మంచి విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.