కమెడియన్స్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాత.. హీరోలుగా టర్న్ అవ్వాలని చాలా మంది చేతులు కాల్చుకున్నారు. బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్, కృష్ణ భగవాన్, వేణు మాధవ్ వంటి కమెడియన్స్ ఒకానొక టైంలో హీరోలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే హీరోలుగా మార్కెట్ పెంచుకోలేక.. ఆడియన్స్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక..త్వరగానే వీళ్ళు మళ్ళీ కామెడీ బాట పట్టి సేఫ్ అయ్యారు.
అయితే సునీల్ మాత్రం హీరోగా నిలబడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందుకు కారణాలు లేకపోలేదు. సునీల్.. ఒకానొక టైంలో బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్ వంటి స్టార్ కమెడియన్స్ ని పక్కకి నెట్టి టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. సునీల్ కామెడీ కోసం ‘సొంతం’ ‘నవ వసంతం’ వంటి సినిమాలు ఆడాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అందుకే అతని ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని చాలా మంది దర్శకులు, నిర్మాతలు ట్రై చేశారు.
‘అందాల రాముడు’ సినిమాతో సునీల్ హీరోగా మొదటి అడుగు వేశాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. లక్ష్మీ నారాయణ పెండెం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఎస్.ఎ.రాజ్ కుమార్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు. అయితే మొదట ఈ సినిమాలో నటించడానికి ఆమె ఇష్టపడలేదట.
ఎందుకంటే ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చాలా సినిమాల్లో సునీల్ కమెడియన్ గా నటించాడు. అందువల్ల ఆర్తి వెనకడుగు వేసింది. అయితే ఆ టైంలో ఆమె కొంచెం డౌన్ అయ్యింది. దీంతో పారితోషికం ఎక్కువగా ఇష్టమని ఆఫర్ ఇచ్చి నిర్మాతలు కన్విన్స్ చేశారు. అయినప్పటికీ ఆమె కొన్ని కండిషన్లు పెట్టి.. సునీల్ పక్కన హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుంది. అందులో మొదటిది ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ వంటివి ఉండకూడదు.. ముఖ్యంగా సునీల్ తో ముద్దు సన్నివేశాలు వంటివి అస్సలు ఉండకూడదు అని ఆమె కండిషన్స్ పెట్టిందట. వాటికి దర్శక నిర్మాతలు ఓకే చెప్పిన తర్వాతే ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిందట.అయితే ఒక సీన్లో సిట్యుయేషన్ డిమాండ్ చేయడంతో నామ మాత్రంగా ఆమె బుగ్గ పై ఒక ముద్దు సీన్ పెట్టారట.అయిష్టంగానే ఆమె ఆ సన్నివేశంలో నటించినట్టు తెలుస్తుంది. ఇక 2006 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది.